వరుస హిట్ల తో ఫుల్ స్వింగ్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ..సంక్రాంతి బరిలో ‘డాకు మహారాజ్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) ఫేమ్ బాబీ(Boby) కలయికలో తెరకెక్కిన ఈ మూవీ జనవరి 12న విడుదల విడుదలైంది. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్, ఊర్వశీ రౌతేలా, చాందినీ చౌదరి హీరోయిన్లు నటించారు. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా, సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు.
Haldiram – PepsiCo : హల్దీరామ్‌లోకి పెప్సీకో ఎంట్రీ.. వాటా కొనుగోలుకు చర్చలు
ఇక ఈ మూవీ మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.92 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు యాక్షన్ సీన్స్తో కూడిన ఈ చిత్రాన్ని సంక్రాంతికి తప్పకుండా చూడాలి అని పేర్కొన్నారు. ఇక ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి రూ.67.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం.
ఇక ఓవర్సీస్ లో రూ. 8 కోట్లు, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ. 5.40 కోట్లు. ఇలా డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 80.70 కోట్లకు చేరుకుంది. ఇప్పటి వరకు బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా ‘డాకు మహారాజ్’ నయా రికార్డు క్రియేట్ చేసింది. ఇక డాకు మహారాజ్ బ్రేక్ ఈవెన్ రూ. 82 కోట్లుగా ఫిక్స్ అయింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.