Abhiram : దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి.. సైలెంట్ గా రానా తమ్ముడి వివాహం..

దగ్గుబాటి వారింట పెళ్లి అంటే గ్రాండ్ గా సెలెబ్రేట్ చేస్తారనుకున్నారు. కానీ సైలెంట్ గా దగ్గుబాటి అభిరామ్ పెళ్లి చేసేశారు.

Published By: HashtagU Telugu Desk
Daggubati Suresh Babu Son Abhiram Marriage Happened with Prathyusha

Daggubati Suresh Babu Son Abhiram Marriage Happened with Prathyusha

దగ్గుబాటి రానా(Daggubati Rana) తమ్ముడు అభిరామ్(Abhiram) అందరికి పరిచయమే. గతంలో పలు వివాదాలతో బాగా వైరల్ అయ్యాడు అభిరామ్. ఇటీవల తేజ దర్శకత్వంలో అహింస సినిమాతో ప్రేక్షకుల ముందుకి కూడా వచ్చాడు. కానీ ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. ఆ తర్వాత ఇంకే సినిమాని ప్రకటించలేదు అభిరామ్. గత కొన్నాళ్లుగా అభిరామ్ పెళ్లి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

అయితే దగ్గుబాటి వారింట పెళ్లి అంటే గ్రాండ్ గా సెలెబ్రేట్ చేస్తారనుకున్నారు. కానీ సైలెంట్ గా దగ్గుబాటి అభిరామ్ పెళ్లి చేసేశారు. తమ దూరపు బంధువుల అమ్మాయి అయిన ప్రత్యూషని అభిరామ్ వివాహం చేసుకున్నారు. బుధవారం రాత్రి శ్రీలంకలో ఈ వివాహం జరిగినట్లు సమాచారం. ఈ వివాహానికి కేవలం ఇరు కుటుంబాలు మాత్రమే హాజరయ్యేరు.

ఈ పెళ్లి నుంచి ఓ ఫోటో వైరల్ గా మారడంతో అందరికి ఈ సంగతి కొంచెం ఆలస్యంగా తెలిసింది. రానా పెళ్లిని గ్రాండ్ గా చేసిన సురేష్ బాబు మరి అభిరామ్ పెళ్లి ఇంత సైలెంట్ గా ఎందుకు చేశాడు అని అంతా అనుకుంటున్నారు. అలాగే ఈ పెళ్ళికి సంబంధించి ఎక్కువ ఫోటోలు కూడా బయటకి రాలేదు. అయితే హైదరాబాద్ లో అతి కొద్ది మందికి ప్రత్యేకంగా రెసెప్షన్ ఏర్పాటు చేసి విందు ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. మరి అభిరామ్ మళ్ళీ సినిమాలు చేస్తాడా? లేక తమ సినీ వ్యాపారాలు చూసుకుంటాడా చూడాలి.

 

Also Read : Yash : య‌ష్‌ 19వ సినిమా అప్డేట్ వచ్చేసింది.. టైటిల్ ఏంటో తెలుసా? డైరెక్టర్ ఎవరంటే?

  Last Updated: 08 Dec 2023, 01:01 PM IST