Victory Venkatesh రైటర్ గా ఉన్నప్పుడు విక్టరీ వెంకటేష్ తో చాలా సినిమాలు చేసిన త్రివిక్రం డైరెక్టర్ గా మారిన తర్వాత ఆయనతో ఒక్క సినిమా కూడా చేయకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. దర్శకుడిగా తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పరచుకున్న త్రివిక్రం కథ కథనాలు కాదు డైలాగ్స్ తో సినిమా నడిపించవచ్చు అని నిరూపిస్తున్నారు.
అల వైకుంఠపురంలో లాంటి ఇండస్త్రీ హిట్ ఇచ్చిన తర్వాత సూపర్ స్టార్ మహేష్ తో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసి ఆ వెంటనే అల్లు అర్జున్ తో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు త్రివిక్రం.
Also Read : Anushka : అనుష్క 50.. ఆ మూవీకి సీక్వెల్ చేస్తున్నారా..?
ఇదిలాఉంటే వెంకటేష్ తో త్రివిక్రం (Trivikram) సినిమా గురించి దగ్గుబాటి ఫ్యాన్స్ (Daggubati Fans) ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఒకటి రెండు సందర్భాల్లో ఇద్దరు కలిసి పనిచేయాలని అనుకున్నా అది కుదరలేదు. వెంకటేష్ కూడా త్రివిక్రం తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.
త్రివిక్రం మాత్రమే పవన్, మహేష్, అల్లు అర్జున్ ల చుట్టూ తిరుగుతున్నాడు. అల్లు అర్జున్ తో డబుల్ హ్యాట్రిక్ కి సిద్ధమవుతున్న త్రివిక్రం ఆ సినిమా తర్వాత వెంకటేష్ తో సినిమా చేస్తారని ఫిల్మ్ నగర్ టాక్.
అల్లు అర్జున్ (Allu Arjun) సినిమా చేయగానే వెంకటేష్ తో ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారట త్రివిక్రం. ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే ఒక యువ హీరో కూడా ఉంటాడని టాక్. సో త్రివిక్రం వెంకటేష్ తో ఒక మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. వెంకటేష్ ప్రస్తుతం సైంధవ్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత తరుణ్ భాస్కర్ తో సినిమా ఉంటుందని తెలుస్తుంది. సో అల్లు అర్జున్ సినిమా చేసేలోగా తరుణ్ భాస్కర్ సినిమా పూర్తి చేసి వెంకటేష్ త్రివిక్రం సినిమా చేస్తారని చెప్పొచ్చు.
We’re now on WhatsApp : Click to Join