Daaku Maharaj Success Meet: నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం డాకు మహారాజ్ (Daaku Maharaj Success Meet). ఈ మూవీ సంక్రాంతి సందర్బంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదట్నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోవడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించిన ఈ మూవీకి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. అయితే ఈ మూవీ విడుదలైన ఐదు రోజుల్లో రూ. 100 కోట్ల మార్క్‌ను దాటింది. ఈ సినిమా ఐదు రోజుల్లో మొత్తం రూ. 114 కోట్లను వసూలు చేసి రికార్డు సృష్టించింది. బాలకృష్ణ గత చిత్రం భగవంత్ కేసరి కూడా రూ. 100 కోట్ల మార్క్‌ను దాటిన విషయం తెలిసిందే.
అనంతపురంలో సక్సెస్ మీట్
డాకు మహారాజ్ విజయం సాధించడంతో చిత్రబృందం సక్సెస్ మీట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 22న అనంతపురంలో డాకు మహారాజ్ సక్సెస్ మీట్‌ను నిర్వహించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్ సక్సెస్ మీట్ లో ఈ మేరకు హీరో బాలకృష్ణ ప్రకటించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో సక్సెస్ మీట్ జరపాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే బుధవారం (జనవరి 22) రోజు డాకు మహారాజ్ చిత్ర యూనిట్ అనంతపురం రానుంది.
Also Read: Anil Ravipudi : నేను సినిమాలు ఇలాగే తీస్తా.. ట్రోలర్స్ కి అనిల్ రావిపూడి కౌంటర్
ఈ మూవీలో బాలకృష్ణతో పాటు బాబీ డియోల్, ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశీ రౌతేలా, తదితరులు నటించారు. ఇకపోతే ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యాజిక్‌కు సర్వత్రా ప్రశంసలు వస్తోన్నాయి. ఈ సినిమాతో బాలకృష్ణ సరికొత్త రికార్డులను సైతం నమోదు చేశారు. వరుస హిట్లతో సినీయర్ హీరోల్లో ముంద వరసలో నిలిచారు. ఈ మూవీ తర్వాత బాలయ్య అఖండ-2 మూవీతో బిజీ కానున్నారు. ఒకవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న బాలకృష్ణ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. బోయపాటి శ్రీను- బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన అఖండ మూవీకి సీక్వెల్‌గా అఖండ-2 సినిమా రానుంది.