నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) బాక్స్ ఆఫీస్ వద్ద దడ పుట్టిస్తుంది. వరుస బ్లాక్ బస్టర్ హిట్ల తో ఫుల్ స్వింగ్ లో ఉన్న బాలయ్య..మరోసారి సంక్రాంతి విన్నర్ అనిపించుకున్నాడు. బాలయ్య సినిమా రిలీజ్ అవుతుంది అంటే థియేటర్స్ దగ్గర హడావిడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో సంక్రాంతి కానుకగా విడుదలయ్యే సినిమాకు ఉండే హైపే వేరు. థియేటర్స్ దగ్గర భారీ కటౌట్స్ తో పాటు పాలాభిషేకాలు, రక్తాలతో తిలకాలు దిద్దటం చేస్తూ ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకుంటారు. ఇక ఇప్పుడు తాజాగా రిలీజైన డాకు మహరాజ్ హిట్ టాక్ తో ఫ్యాన్స్ మరిన్ని సంబరాల్లో మునిగిపోయారు. ఏపీలో ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ చూస్తే ఎవరైనా ఔరా అనాల్సిందే.
Tammineni Veerabhadram: ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక గ్రామ సభలోనే జరగాలి: తమ్మినేని వీరభద్రం
సంక్రాంతి కానుకగా విడుదలైన బాలయ్య ‘డాకు మహారాజ్’ మూవీ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. దీంతో ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. ఈ సినిమా సరికొత్త రికార్డ్ క్రియోట్ చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దుమ్మురేపిన బాలయ్య, డాకు మాహారాజ్ సూపర్ హిట్ అంటూ తెగ హల్చల్ చేస్తున్నారు. బాబీ డైరెక్షన్లో నాగవంశీ నిర్మించిన ఈ మూవీని చూసిన నందమూరి అభిమానే కాదు సగటు సినీ లవర్ సైతం సినిమా అద్భుతంగా ఉందని , బాలకృష్ణ చించేసాడని , థమన్ BGM బద్దలు కొట్టాడని , డైరెక్టర్ బాబీ బాలయ్య ను ఎలా అయితే చూడాలని అనుకుంటున్నారో ఆలా చూపించి సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చారని ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ చిత్ర ఓటీటీ హక్కులను ‘నెటిక్స్’ (netflix) దక్కించుకుంది. అయితే, 4 నుంచి 8 వారాల్లో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని సినీవర్గాలు పేర్కొన్నాయి.