Daaku Maharaaj : అమెరికాలో ‘డాకు మహారాజ్’ ఈవెంట్

Daaku Maharaaj : అమెరికాలో 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్​ గ్రాండ్​గా చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. డల్లాస్​ నగరంలో ఈ ఈవెంట్​కు ప్లాన్ చేశారు

Published By: HashtagU Telugu Desk
Daaku Maharaaj Movie Event

Daaku Maharaaj Movie Event

నందమూరి బాలకృష్ణ (Balakrishna) లేటెస్ట్ మూవీ ఎన్.బి.కె 109 సినిమా కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వాల్తేర్ వీరయ్య తర్వాత బాబీ (Bobby) డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా భారీ అంచనాలు ఏర్పరచుకుంది. ఇక వరుస సక్సెస్ లతో సూపర్ ఫాం లో ఉన్న బాలకృష్ణ ఈసారి డాకు మహారాజ్ (Daaku Maharaaj ) గా రాబోతున్నాడు. బాబీ మాస్ టేకింగ్ బాలయ్య లుక్ డాకు మహారాజ్ టీజర్ ఫ్యాన్స్ కే కాదు కామన్ ఆడియన్స్ కి కూడా గూస్ బంప్స్ తెప్పించింది. సంక్రాంతి బరిలో నిలువబోతున్న ఈ మూవీ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇక సినిమా రిలీజ్ కు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి సారించారు.

ఇందులో భాగంగా శనివారం మూవీ రిలీజ్ కౌంట్ డౌన్ అంటూ ప్రత్యేక పోస్టర్ ను రిలీజ్ చేసారు. మరో 50 రోజుల్లో డాకు మహారాజ్ థియేటర్లలో సందడి చేయనున్నాడంటూ మేకర్స్​ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. అంతే కాదు అమెరికాలో ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్​ గ్రాండ్​గా చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. డల్లాస్​ నగరంలో ఈ ఈవెంట్​కు ప్లాన్ చేశారు. 2025 జనవరి 4న సాయంత్రం 6 గంటలకు ప్రోగ్రామ్ ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా రీలీజ్ చేశారు. ‘డల్లాస్ డాకు మహారాజ్ జోన్ కాబోతుంది. హలో USA గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బలకృష్ణకు స్వాగతం పలుకడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. దీనిని బట్టి చూస్తే సినిమాను ఇంటర్నేషనల్ లెవెల్​లో ప్రమోట్ చేస్తున్నట్లు అర్ధం అవుతుంది.

ఇక బాలయ్య కు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అమెరికా లోను విపరీతమైన అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఈసారి అక్కడ ఈవెంట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ దేఓల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మ్యూజిక్ సంచలనం తమన్ సంగీతం అందిచగా, సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్​పై సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Read Also : Maharashtra Election Result: మహారాష్ట్రలోని ఈ 5 స్థానాల్లో 300 నుంచి 3000 ఓట్ల తేడాతో గెలుపు ఓటములు!

  Last Updated: 24 Nov 2024, 12:07 AM IST