Site icon HashtagU Telugu

Viral Pics: నయన్-విఘ్నేశ్ కవల​ పిల్లలను చూశారా.. భలే క్యూట్ గా ఉన్నారే!

Nayan Kids

Nayan Kids

అందాల జంట నయనతార, విఘ్నేష్ శివన్ తమ కవల అబ్బాయిలు ఉయిర్, ఉలాగ్‌ లకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోలు అభిమానులకు విపరీతంగా ఆకట్టుకున్నాయి.  సెప్టెంబర్ 26న వారు తమ కుమారుల మొదటి పుట్టినరోజును జరుపుకున్నారు.  ఉయిర్ మరియు ఉలాగ్‌లతో కలిసి పుట్టినరోజును జరుపుకోవడానికి మలేషియాకు బయలుదేరారు. ఆదేశంలో పేరొందిన టవర్స్ దగ్గర ఫొటోలకు ఫోజిలిచ్చారు. నయనతార మరియు విఘ్నేష్ తమ కుమారుల పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారాయి.

నయనతార మరియు విఘ్నేష్ శివన్ వివాహం చేసుకున్న నాలుగు నెలల తర్వాత 2022లో కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. వారు సరోగసీ ద్వారా తల్లిదండ్రులు అయ్యారు. సెప్టెంబర్ 26న ఉయిర్ మరియు ఉలాగ్ మలేషియాలోని కౌలాలంపూర్‌లో తమ మొదటి పుట్టినరోజును జరుపుకున్నారు. మొదటిసారి తమ కుమారుల ఫొటోలను క్లియర్ గా చూపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Srisailam: అక్టోబరు 15 నుంచి శ్రీశైలంలో దసరా ఉత్సవాలు షురూ!