Saif Ali Khan – Auto Rickshaw : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటన ఇప్పుడు జాతీయ మీడియాలో ప్రధాన వార్తాంశంగా మారింది. సైఫ్‌పై అంత దారుణంగా దాడి చేసింది ఎవరు ? అనేది మిస్టరీగా మారగా.. దాడి జరిగిన తర్వాత ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లింది ఎవరు ? అనే దానిపై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. దీనిపై తీరొక్క విధంగా ప్రచారం జరుగుతోంది. సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ వచ్చి ఆటోలో ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ సమయంలో ఇంట్లో కారు అందుబాటులో లేకపోవడంతో.. ఆటోలో వెళ్తారని ఆ వార్తల్లో ప్రస్తావించారు. అయితే అది నిజం కాదని వెల్లడైంది.
Also Read :Caller ID Feature : ప్రతీ ఫోనులో కాలర్ ఐడీ ఫీచర్.. ట్రయల్స్ చేస్తున్న టెల్కోలు
గురువారం తెల్లవారుజామున 2 గంటలకు ముంబైలోని బాంద్రాలో ఉన్న సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి దొంగ చొరబడ్డాడు. ఈవిషయాన్ని తొలుత ఇంట్లోని పని మనిషి గుర్తించింది. ఆమె అరుపులు, కేకలు పెట్టింది. దీంతో సదరు దొంగ నేరుగా వెళ్లి ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఆ శబ్దాలు విని బెడ్ రూం నుంచి బయటికి వచ్చిన సైఫ్ అలీఖాన్‌పైనా దొంగ కత్తిపోట్లు పొడిచాడు. దీంతో మెడ, చెయ్యి, వీపు భాగాల్లో సైఫ్ అలీఖాన్‌కు బాగా రక్తస్రావం అయింది. వెన్నెముక భాగంలోకి కత్తి దిగినట్లు తెలిసింది. మొత్తం ఆరు కత్తిపోట్లకుగానూ.. రెండు కత్తిపోట్లు లోతుగా దిగాయి. ఈపరిస్థితుల్లో వెంటనే ఇంటి పనిమనిషి చొరవ చూపింది. హుటాహుటిన ఆటోలో సైఫ్ అలీఖాన్‌ను ముంబైలోని లీలావతి ఆస్పత్రికి(Saif Ali Khan – Auto Rickshaw) తీసుకెళ్లి చేర్పించింది. ఈవిషయాన్ని సైఫ్ అలీఖాన్ మేనేజర్ కూడా ధ్రువీకరించారు. సైఫ్ ఇంట్లో పనిచేసే సదరు మహిళకు డ్రైవింగ్ రాదు. ఆ సమయంలో ఇంట్లో డ్రైవరు అందుబాటులో లేడు. కరీనా కపూర్ కూడా ఇంట్లో లేరు. దీంతో సదరు పని మనిషి సైఫ్ అలీఖాన్‌ను ఆటోలో ఆస్పత్రికి తరలించారు. సైఫ్‌ను ఆస్పత్రికి తీసుకొచ్చే సమయంలో ఆయన కుమారుడు లేడని స్పష్టం చేశారు.
Also Read :Kerala Mans Samadhi : ఓ వ్యక్తి సజీవ సమాధిపై మిస్టరీ.. సమాధిని తవ్వి ఏం చేశారంటే..
దీనికి ఆధారంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో సైఫ్ అలీఖాన్ భార్య కరీనా కపూర్ లీలావతి ఆస్పత్రిలో ఉన్నట్టుగా చూపించారు. అక్కడున్న తన ఇంటి పనిమనిషితో మాట్లాడిన తర్వాత.. సైఫ్ అలీఖాన్‌ను చూడటానికి ఆస్పత్రిలోకి కరీనా ఆందోళనగా వెళ్తున్నట్టుగా ఆ వీడియోలో ఉంది. ఇక సైఫ్ మొదటి భార్య కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ .. సైఫ్ నివాసానికి దూరంలోని మరో ఇంట్లో ఉంటున్నాడు. దొంగతనం జరిగిన ఇంట్లో అతడు ఉండటం లేదు. గతేడాది ఎన్‌సీపీ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీని ముంబైలోని బాంద్రాలోనే కొందరు దారుణంగా కాల్చి చంపారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటిపైనా గతేడాది కాల్పులు జరిగాయి. మొత్తం మీద ఈ పరిణామాలు ముంబైలోని సెలబ్రిటీ వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.