Sreeleela with Chiru: శ్రీలీల జోరు.. చిరు మూవీలో యంగ్ బ్యూటీకి క్రేజీ ఆఫర్!

ధమాకా తో తన టాలెంట్ ను బయటపెట్టిన శ్రీలీలకు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Chiru And Sreeleela

Chiru And Sreeleela

టాలీవుడ్ అంటే శ్రీలీల (Sreeleela).. శ్రీలీల అంటే టాలీవుడ్. ప్రస్తుతం కుర్ర హీరోయిన్ శ్రీలీల వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ధమాకా తో తన టాలెంట్ ను బయటపెట్టిన శ్రీలీలకు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే విజయ్ దేవరకొండ, బాలయ్య బాబు, ఇతర హీరోలతో నటిస్తున్న ఈ బ్యూటీ మెగా స్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)లోనూ నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక హీరోలు కూడా శ్రీలీల కోసం డిమాండ్ చేయడం విశేషం.

అయితే ప్రస్తుతం శ్రీలీల ఫుల్ బిజీగా ఉంది. ఆమె డేట్స్ ఆధారంగా ఇతర సినిమాలను కమిట్ అవుతంది. ఇక నిర్మాతలు (Makers) కూడా శ్రీలీల డేట్స్ ను బట్టి షూటింగ్స్ చేయడానికి ఒప్పుకుంటున్నారట. తాజాగా చిరంజీవి సినిమాలో కూడా మెగాస్టార్ సరసన కథానాయికగా నటించేందుకు శ్రీలీల పేరును పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలోని యువ హీరోతో పాటు ఆమె పాత్ర కోసం పరిశీలిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇకపై సోలో సినిమాలు చేయడం మానేసి, యంగ్ హీరోలతో కలిసి నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఇటీవల రవితేజతో కలిసి నటించిన చిరు ఈసారి చిరు సిద్ధూ జొన్నలగడ్డతో కలిసి నటించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఇంకా నిర్ణయం ఫైనల్ కాలేదు. కానీ సిద్ధూ పక్కన శ్రీలీలని హీరోయిన్ గా పెట్టాలనేది ప్లాన్. ఆ పాత్రకు అంగీకరించడం శ్రీలీల (Sreeleela)కి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. బెజవాడ ప్రసన్న కథ అందించిన ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి కూతురు నిర్మాత. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఇటీవల ప్రొడక్షన్ ఆఫీస్‌ను ప్రారంభించారు. భోళాశంకర్ తర్వాత మెగాస్టార్ నటిస్తున్న సినిమా ఇదే.

Also Read: Massage Centers: అమ్మాయిలతో మసాజ్ చేయిస్తూ.. పోలీసులకు దొరికిపోయి!

  Last Updated: 05 May 2023, 03:51 PM IST