Site icon HashtagU Telugu

NBK108 Title: ‘భగవంత్ కేసరి’గా బాలయ్య బాబు.. ‘ఐ డోన్ట్ కేర్’ ట్యాగ్ లైన్ తో!

Nbk108

Nbk108

నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా పేర్లు వైవిధ్యంగా ఉంటాయి. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా, సమకాలీన అంశాలను టచ్ చేసే విధంగా ఉంటాయి. అందుకే తన సినిమాలకు పోషించే పాత్రల పేర్లను పెట్టే సంప్రదాయాన్ని కొనసాగిస్తుంటారు. #NBK108గా పిలవబడే అతని తాజా చిత్రం కూడా అంచనాలను రేపుతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రానికి ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ‘ఐ డోన్ట్ కేర్’ అనే ట్యాగ్‌లైన్‌తో బాలయ్య మరోసారి పవర్ పుల్ రోల్ లో కనిపించబోతున్నాడు.

ఈ సినిమాలో బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ అనే క్యారెక్టర్‌లో తెలంగాణ యాసలో మాట్లాడుతున్నాడు. తెలంగాణ నేపథ్యంలో సాగే కథ. రివెంజ్ డ్రామాగా అభివర్ణించబడిన ఈ చిత్రంలో బాలకృష్ణ శ్రీలీల పాత్రలో ‘కాకా’ (మామ) పాత్రను పోషించారు. బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఇక ఈ మూవీలో ఓ బాలీవుడ్ నటుడు విలన్ గా నటిస్తున్నాడు.

Also Read: IPL Final: డిజిటల్ స్ట్రీమింగ్ లో JioCinema రికార్డ్, 3.2 కోట్ల వ్యూయర్ షిప్ తో ఐపీఎల్ ఫైనల్!