Rajinikanth Jailer 2 : జైలర్ 2 కి అదిరిపోయే టైటిల్.. డబుల్ ఇంపాక్ట్ పక్కా..!

Rajinikanth Jailer 2 సూపర్ స్టార్ రజినికాంత్ సూపర్ హిట్ మూవీ జైలర్ ఆయన్ను తిరిగి ఫాం లోకి వచ్చేలా చేసింది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన జైలర్ సినిమా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆకలి తీర్చింది.

Published By: HashtagU Telugu Desk
Crazy Title for Rajinikanth Jailer 2

Crazy Title for Rajinikanth Jailer 2

Rajinikanth Jailer 2 సూపర్ స్టార్ రజినికాంత్ సూపర్ హిట్ మూవీ జైలర్ ఆయన్ను తిరిగి ఫాం లోకి వచ్చేలా చేసింది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన జైలర్ సినిమా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆకలి తీర్చింది. సినిమా వరల్డ్ వైడ్ గా 500 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. జైలర్ సినిమాలో రజినీని చూసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ప్రస్తుతం లోకేష్ వెట్టయాన్ సినిమా చేస్తున్నారు. టీజే గ్నానవెల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రజిని సినిమా లైన్ లో ఉంది. అయితే దీనితో పాటు జైలర్ సీక్వల్ గా జైలర్ 2 ని కూడా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ ఇప్పటికే జైలర్ 2 కి సంబందించిన స్టోరీ రెడీ చేశారట. జైలర్ 2 సినిమాకు కొత్త టైటిల్ కూడా పెట్టబోతున్నారని తెలుసుతంది.

జైలర్ 2 కి హుకుం అని టైటిల్ లాక్ చేస్తున్నారట. జైలర్ సినిమాలో హుకుం సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. అనిరుధ్ రవిచంద్రన్ అందించిన మ్యూజిక్ జైలర్ కు బాగా హెల్ప్ అయ్యింది. ముఖ్యంగా ఈ సినిమా సీక్వల్ కు హుకుం అని టైటిల్ పెట్టేందుకు అనిరుద్ అందించిన మ్యూజిక్ అని చెప్పొచ్చు. వెట్టయాన్ రిలీజ్ తర్వాత లోకేష్ సినిమాతో పాటు జైలర్ 2 అదే హుకుం సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు రజినీకాంత్.

రజిని సినిమాకు సీక్వల్ అనగానే సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. తప్పకుండా జైలర్ 2 అదే హుకుం జైలర్ ఏర్పరచిన రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డులను సృష్టించేలా ఉండాలని చూస్తున్నారు.

Also Read : Vijay Devarakonda : ఫ్యామిలీ స్టార్ ఎఫెక్ట్.. VD12 ప్లాన్ చేంజ్..!

  Last Updated: 12 Apr 2024, 10:53 PM IST