Site icon HashtagU Telugu

Jigris : ‘జిగ్రీస్’ టీజర్ ను విడుదల చేయబోతున్న క్రేజీ డైరెక్టర్

Jigris Teaser

Jigris Teaser

యువతను ఆకట్టుకునే కథాంశంతో వస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘జిగ్రీస్’ (Jigris ) సినిమా ఇప్పుడు వార్తల్లో నిలిచింది. చిన్ననాటి స్నేహితుల మధ్య జరిగే సరదా సంఘటనలు, గొడవలు, పంచ్‌లతో కూడిన ఈ చిత్రం, ఒక స్నేహితుల బృందం కథగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా, రామ్ నితిన్ లు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హరిష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మౌంట్ మెరు పిక్చర్స్ బ్యానర్‌పై కృష్ణ వోడపల్లి నిర్మిస్తున్నారు.

SVSN Varma : వైసీపీ లోకి వర్మ..? పిఠాపురం రాజకీయాలు వేడెక్కబోతున్నాయా..?

ఈ సినిమా టీజర్ విడుదల వేడుకకు ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి (Sundeep Reddy) వంగా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇప్పుడు ఈ నెల 8వ తేదీన రాత్రి 8 గంటలకు ఎల్‌బీనగర్‌లోని అర్బన్ మాయా బజార్‌లో జరిగే టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన చేతుల మీదుగా టీజర్ రిలీజ్ కానుంది. ఈ వేడుకతో సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇప్పటికే విడుదలైన పోస్టర్‌ యువతను బాగా ఆకట్టుకుంది. స్నేహం, చిన్ననాటి జ్ఞాపకాలు, సాహసాలు, హాస్యం వంటి అంశాలతో ఈ సినిమా యువతకు ఒక కొత్త అనుభూతినిస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ టీజర్ విడుదల తర్వాత సినిమా మరింత ప్రాచుర్యం పొందుతుందని, ప్రేక్షకులలో సినిమాపై ఆసక్తి పెరుగుతుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.