Site icon HashtagU Telugu

Bigg Boss7: బిగ్ బాస్ పై హైకోర్టుకు సిపిఐ నారాయణ లేఖ

Bigg Boss7

Bigg Boss7

Bigg Boss7: రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 7 అనంతరం చోటుచేసుకున్న హింస, విధ్వంసంపై ఆందోళన వ్యక్తం చేస్తూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ లేఖ కంటెస్టెంట్స్ గురించి మాత్రమే కాదని షో నిర్వాహకుల గురించి కూడా అని చెప్పారు. టిఆర్‌పి కోసం హౌస్ లో రకరకాల వేషాలు వేస్తున్నారని, టీవీ చూసే వారిని చెడగొడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.

బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అభిమానులు పలు వాహనాలను ధ్వంసం చేశారు. వాళ్ళ దాడిలో అమర్‌దీప్‌, అశ్విని, గీతూ రాయల్‌లకు చెందిన కార్లు, ఆర్టీసీ బస్సులు ధ్వంసమయ్యాయి. దీంతో అశ్విని, గీతు జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.దీనిపై సరైన చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని సిపిఐ నారాయణ హైకోర్టును కోరారు. ఈ విషయంలో నిర్వాహకులను హెచ్చరించి, వారిపై చర్యలు తీసుకోవాలని సాధారణ ప్రజల సంక్షేమం కోసం నేను కోర్టును ప్రార్థిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్ ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. గత రాత్రి ఆయన గ్రామానికి వెళ్లి అరెస్ట్ చేశారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అయితే 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ విధించడంతో ప్రశాంత్ ను చంచల్ గూడా జైలుకు తరలించారు.

Also Read: Telangana: కిరోసిన్ దీపంతో చదువుకున్న జగదీష్ రెడ్డికి వేల కోట్లు ఎలా వచ్చాయి

Exit mobile version