నేచురల్ స్టార్ నాని (Nani) నిర్మాతగా వ్యవహరించిన లేటెస్ట్ మూవీ ‘కోర్ట్'(Court). ప్రియదర్శి, శ్రీదేవి, హర్ష్ రోషన్ (Priyadarshi, Sridevi, Harsh Roshan)కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్నా, రిలీజ్‌కు రెండు రోజులు ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్‌తో సందడి చేసి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రీమియర్స్ లలో ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి ప్రియదర్శి ఎమోషనల్ అయ్యారు. థియేటర్‌లో నేలపై కూర్చొని నిర్మాత నానిని హత్తుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను నాని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.
కథ విషయానికి వస్తే..
ఈ సినిమా కథ చట్టాల చుట్టూ తిరుగుతూ, ముఖ్యంగా పోక్సో చట్టం దుర్వినియోగంపై దృష్టి పెడుతుంది. గతంలో వచ్చిన ‘నాంది’ లాంటి చిత్రాలు చట్టాలపై అవగాహన కల్పించగా ‘కోర్ట్’ కూడా సమాజంలో జరుగుతున్న అన్యాయాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రేమకథతో ముడిపడిన ఈ చిత్రం మొదటి భాగంలో టీనేజ్ ప్రేమ, యువత ఆలోచనలు, ఆకర్షణలను అందంగా చిత్రీకరించింది. అయితే ఇంటర్వెల్ అనంతరం అసలు కోర్ట్ రూమ్ డ్రామా ప్రారంభమవుతుంది. చందు అనే యువకుడిపై వచ్చిన కేసును తేజ అనే వ్యక్తి స్వయంగా టేకప్ చేయడం, కేసులో వచ్చే మలుపులు చిత్రాన్ని ఉత్కంఠభరితంగా మార్చాయి.
Alcohol Addiction: తాగుబోతులుగా మారిన భార్యలు.. భర్తల ఫిర్యాదు
సినిమా సెకెండాఫ్‌లో కేసు విచారణలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, చట్టాలపై అవగాహన కల్పించే ప్రయత్నం ప్రశంసించదగినది. దర్శకుడు కథలో కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నప్పటికీ, పోక్సో చట్టం దుర్వినియోగం, పోలీసులు దర్యాప్తులో ఉపయోగించే విధానాలు, చట్ట వ్యవస్థలోని లొసుగులను స్పష్టంగా చూపించారు. కథలో ట్విస్టులు ఎక్కువగా లేకున్నా, ఇందులో చెప్పిన మెసేజ్ ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. ప్రేమకథ, కుటుంబ నేపథ్యం కథపై ప్రభావం చూపించడంతో పాటు, చట్టాలపై అవగాహన పెంచే ప్రయత్నం చేయడం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపింది. మొత్తంగా ‘కోర్ట్’ ఓ మంచి కథ, అద్భుతమైన అభిప్రాయాలను కలిగి, ప్రేక్షకులకు ఆసక్తికరంగా అనిపించే చిత్రంగా నిలిచింది.
♥️@PriyadarshiPN
Premieres Today. #Court#CourtStateVsANobody pic.twitter.com/sVp6Vn8eSP— Nani (@NameisNani) March 13, 2025