నేచురల్ స్టార్ నాని (Nani) నిర్మాతగా వ్యవహరించిన తాజా చిత్రం ‘కోర్ట్’ (Court) ఓటీటీ(OTT) లో విడుదలకు సిద్ధమైంది. ప్రియదర్శి, శ్రీదేవి, హర్ష్ రోషన్ వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు రామ్ జగదీష్ ఈ సినిమాను తెరకెక్కించారు. మార్చి 14న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఇప్పుడు మూవీ త్వరలో ఓటీటీ ప్లాట్‌ఫామ్ మీద స్ట్రీమింగ్ కాబోతుంది.
Kakani Govardhan Reddy : కాకాణి గోవర్థన్ కు మరో షాక్
‘కోర్ట్’ డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. సినిమా వర్గాల సమాచారం ప్రకారం.. ఈనెల 11న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ప్రారంభం కానుందని, అధికారిక ప్రకటన ఈ వారం లో రానుందని తెలుస్తోంది. వెండితెరపై సూపర్ హిట్ అయినా ఈ మూవీ..ఓటిటి ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే.. ఒక ప్రేమికుల కథగా తెరకెక్కింది. శివాజీ చేసిన అద్భుతమైన నటన ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది. సినిమా మొదటి షో నుంచే మంచి టాక్ తెచ్చుకుని, బాక్సాఫీస్ వద్ద సునామీ వసూలు చేసింది. వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా ఇప్పటివరకు రూ.56.50 కోట్ల వసూలు చేసి, ఓవర్సీస్ లోనూ రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించింది. నాని ఈ సినిమాను 11 కోట్ల వ్యయంతో నిర్మించారు.