హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన ‘కోర్టు’ (Court) మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మల్లేశం, బలగం వంటి సినిమాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన ప్రియదర్శి.. తాజాగా కోర్ట్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా మార్చి 14న ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. ప్రియదర్శి, హర్ష్ రోషన్, సాయికుమార్, శివాజీ, హర్షవర్థన్, రోహిణి, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విషికా కీర్తి, శ్రీదేవి అపాళ్ల తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. విజయ్ బుల్గానియన్ సంగీత దర్శకత్వం వహించగా.. రామ్ జగదీష్ కోర్ట్ మూవీని డైరెక్ట్ చేశారు.
Anna Canteen : అన్నక్యాంటీన్‌లో ఫ్రీ భోజనం..ఎక్కడంటే !
వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేనేని ఈ సినిమాను నిర్మించగా.. నాని సమర్పకుడిగా వ్యవహరించారు. ఇక ఈ మూవీ కలెక్షన్ల విషయానికి వస్తే..విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ.24.4 కోట్లు వసూలు చేసినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. ప్రేక్షకులు బ్లాక్బస్టర్ తీర్పు ఇచ్చారని , యూఎస్ఏలో 600K డాలర్లు రాబట్టిందని సినీ వర్గాలు చెప్పుకొస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ఆంధ్రా , నైజాం, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో ఈ సినిమాకు రూ.10 కోట్ల మేర బిజినెస్ చేసింది.