Site icon HashtagU Telugu

Piracy : దారుణం..ఆన్లైన్ లో HD ప్రింట్ తో కూలీ , వార్ 2 చిత్రాలు

Coolie War2

Coolie War2

పైరసీ బెడద సినీ పరిశ్రమను తీవ్రంగా కలవరపెడుతోంది. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే హెచ్‌డీ ప్రింట్లు ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. ఈ సమస్య చిన్న హీరోల చిత్రాల నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు అన్నింటినీ వెంటాడుతోంది. ఈ క్రమంలో తాజాగా విడుదలైన సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కూలీ’ మరియు ఎన్టీఆర్ ‘వార్ 2’ (Coolie , War 2)చిత్రాలు కూడా పైరసీకి గురయ్యాయి. ఈ సినిమాల పూర్తి హెచ్‌డీ ప్రింట్లు టెలిగ్రామ్ గ్రూపులు, పైరసీ వెబ్‌సైట్‌లలో దర్శనమిస్తున్నాయి. దీంతో సినీ నిర్మాతలు, అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

‘కూలీ’, ‘వార్ 2’ సినిమాలు భారీ బడ్జెట్‌తో నిర్మించిన పాన్-ఇండియా చిత్రాలు. వీటి కోసం వందల కోట్లు ఖర్చు చేశారు. పైరసీ వల్ల ఈ చిత్రాలకు భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌లో సినిమా అందుబాటులోకి రావడం వల్ల చాలామంది థియేటర్లకు వెళ్లడానికి ఆసక్తి చూపించకపోవచ్చు. ఇది బాక్సాఫీస్ వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పైరసీని అరికట్టడానికి నిర్మాతలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఈ సమస్యను పూర్తిగా నివారించడం కష్టంగా మారింది. ప్రేక్షకులు కూడా పైరసీని ప్రోత్సహించకుండా థియేటర్లలోనే సినిమాలు చూడాలని సినీ వర్గాలు కోరుతున్నాయి.

‘కూలీ’ సినిమా గురించి చెప్పాలంటే.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి స్పందన పొందుతోంది. లోకేష్ స్క్రీన్‌ప్లే, రజినీకాంత్ యాక్షన్, నాగ్ విలనిజం ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అనిరుధ్ నేపథ్య సంగీతం సినిమాకు మరో హైలైట్‌గా నిలిచింది. ఇక ‘వార్ 2’ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది ఎన్టీఆర్ రోల్ ఆశించిన స్థాయిలో లేదని చెబుతున్నారు. యాక్షన్ సన్నివేశాలు అవాస్తవంగా ఉన్నాయని, పాటలు, నేపథ్య సంగీతం కూడా అంతంతమాత్రమేనని విమర్శిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, స్క్రీన్‌ప్లేలో లోపాలున్నాయని అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద, ఈ రెండు చిత్రాల పైరసీ సినీ పరిశ్రమకు పెద్ద సవాలుగా నిలుస్తోంది.

Rishabh Pant: రిష‌బ్ పంత్‌పై మాథ్యూ హేడెన్ కుమార్తె గ్రేస్ హేడెన్ ప్ర‌శంస‌లు!