Rajinikanth సూపర్ స్టార్ రజినికాంత్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూలీ. సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ ఈ మూవీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఒక టీజర్ రిలీజైంద్. అయితే టీజర్ లో రజినికాంత్ ఓల్డ్ మూవీ డైలాగ్ ఒకటి యాటిటీజ్ దించేశారు. రజిని నటించిన తంగమగన్ సినిమాలోని వా వా పక్కం వా పాటని దించారు. తన పర్మిషన్ లేకుండా తన పాటని వాడినందుకు మేకర్స్ తో లీగల్ ఫైట్ కు సిద్ధమయ్యాడు మ్యాస్ట్రో ఇలయరాజా.
అందుకు సంబందించి కోర్టులో కేసు ఫైల్ చేశాడు. అనుకోని విధంగా కూలీ సినిమాపై ఈ కేసు తలనొప్పిగా మారింది. రజిని సినిమానే కదా అని ఇలయరాజా కూడా వదిలి పెట్టలేదు. అయితే ఈ ఇష్యూ ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు కానీ ఈ విషయంపై సూపర్ స్టార్ రజిని స్పందన ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది.
లేటెస్ట్ గా రజినీ చెన్నై ఎయిర్ పోర్ట్ లో కనిపించగా రిపోర్టర్స్ అంతా కూడా కూలీ సాంగ్ పై ఇళయరాజా వేసిన కేసు గురించి అడిగారు. దానికి స్పందించిన రజిని అది ఇళయరాజా, నిర్మాత కళానిధి మారన్ తేల్చుకుంటారని అన్నారు. అయితే ఇళయరాజాని కన్విన్స్ చేసి ఫిర్యాధుని వెనక్కి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది.
Also Read : Poonam Kaur : బాలకృష్ణ అల్లుడి ఫై పూనమ్ కౌర్ ట్వీట్