Site icon HashtagU Telugu

Coolie Mania : సెలవు ప్రకటించిన సాఫ్ట్ వెర్ కంపెనీ

Rajinikanth Coolie Movie

Rajinikanth Coolie Movie

సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth ) సినిమా వస్తుందంటే చాలు.. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానుల్లో ఎంత ఉత్సాహం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రజినీకాంత్ నటించిన తాజా చిత్రం ‘కూలీ’ (Coolie Movie) ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రజినీకాంత్ సినిమా విడుదల రోజున ఉద్యోగులు ఆఫీస్‌కి రాకుండా సినిమా చూసేందుకు వెళ్లడం సర్వసాధారణం. దీనిని దృష్టిలో ఉంచుకుని కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవు ఇస్తుంటాయి. ఇప్పుడు ‘కూలీ’ సినిమా కోసం కూడా అలాంటి ఘటనే జరిగింది.

యూనో ఆక్వా కేర్ అనే సాఫ్ట్‌వేర్ సంస్థ (Uno aqua care software company) తమ ఉద్యోగులకు రజినీకాంత్ సినిమా ‘కూలీ’ విడుదల రోజున సెలవు ప్రకటించింది. సాధారణంగా చాలా మంది ఉద్యోగులు తమ అభిమాన హీరో సినిమా విడుదల రోజున సెలవు కోసం దరఖాస్తు చేసుకుంటారు. అయితే, ఈ కంపెనీ ముందస్తుగానే ఉద్యోగులందరికీ సెలవు ఇచ్చి వారి అభిమానాన్ని గౌరవించింది. ఈ నిర్ణయం ఉద్యోగులందరినీ సంతోషపరిచింది. కంపెనీ నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Anantnag : జమ్మూకశ్మీర్‌లొ ఆవిష్కృతమైన చారిత్రక ఘట్టం

ఈ సెలవు చెన్నై, బెంగళూరు, తిరుచ్చి, తిరునల్వేలి, మధురై, చెంగల్పట్టు, అరపాలయం, మట్టుతవానిల్లో ఉన్న అన్ని బ్రాంచీలకు వర్తిస్తుందని యూనో ఆక్వా కేర్ సంస్థ సర్క్యులర్ పంపింది. తమ ఉద్యోగులు సినిమా చూసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సర్క్యులర్‌లో పేర్కొంది. తమ ఉద్యోగుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ తెలిపింది. దీని ద్వారా కంపెనీకి ఉద్యోగులపై ఉన్న గౌరవం, అభిమానం కూడా తెలుస్తోంది.

రజినీకాంత్ సినిమాకు ఇలా సెలవు ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన సినిమాలు విడుదలైనప్పుడు అనేక కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవులు ప్రకటించాయి. ఇది రజినీకాంత్‌కి ఉన్న అభిమాన బలం, క్రేజ్‌ను తెలియజేస్తుంది. ‘కూలీ’ సినిమా విడుదల సందర్భంగా కంపెనీ సెలవు ప్రకటించడం ఆ చిత్రానికి మరింత హైప్ తీసుకొచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.