సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ’ (Coolie ) సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్ములేపుతుంది. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా, బాలీవుడ్‌లో జూనియర్ ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ నటించిన ‘వార్ 2’ చిత్రంతో పోటీ పడుతోంది. అయితే అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘కూలీ’ భారీ స్థాయిలో టికెట్లను విక్రయించి, ‘వార్ 2’ కంటే ఎంతో ముందుంది. తక్కువ షోలు ఉన్నప్పటికీ, కూలీ సినిమా టికెట్ల విక్రయాలు వార్ 2 కన్నా 561.7% ఎక్కువగా జరిగాయి. ఇప్పటివరకు ‘కూలీ’ రూ. 17.72 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ వసూలు చేయగా, ‘వార్ 2’ కేవలం రూ. 4.11 కోట్లు మాత్రమే సాధించింది.
కూలీ సినిమా కేవలం భారతదేశంలోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో ప్రీమియర్ ప్రీ-సేల్స్‌లో $2 మిలియన్లు (దాదాపు రూ. 16.5 కోట్లు) వసూలు చేసిన తొలి తమిళ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ రికార్డు గతంలో వచ్చిన విజయ్ ‘లియో’ సినిమా ప్రీ-సేల్స్ రికార్డును బద్దలు కొట్టింది. రజినీకాంత్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఈ వసూళ్లు స్పష్టంగా చూపిస్తున్నాయి. అమెరికా, యూకే వంటి దేశాల్లో కూడా టికెట్లు భారీగా అమ్ముడయ్యాయి.
Election Commission : మరో 476 రాజకీయ పార్టీల రద్దుకు ఈసీ నిర్ణయం
‘కూలీ’ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు ఎంత ఎక్కువగా ఉన్నాయో చెప్పడానికి సింగపూర్‌లోని ‘Uno Aqua Care’ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీ తమ ఉద్యోగులకు సినిమా చూసేందుకు సెలవు ప్రకటించడమే నిదర్శనం. అలాగే అమెజాన్ డెలివరీ బాక్సులపై సినిమా పోస్టర్లను ముద్రించడం వంటి కొత్త ప్రచార పద్ధతులు నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో రజినీకాంత్‌తో పాటు నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర వంటి స్టార్స్ నటించడంతో అభిమానుల ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా నాగార్జున విలన్‌గా నటిస్తున్నారని తెలియగానే అందరిలో ఉత్సాహం రెట్టింపైంది.