Site icon HashtagU Telugu

Coolie : ‘కూలీ’ రెమ్యునరేషన్ రూమర్లకు ఆమిర్ ఖాన్ చెక్

Aamir Khan

Aamir Khan

Coolie : ‘కూలీ’ సినిమా విజయంలో తన పాత్ర కేవలం చిన్న భాగమేనని, అసలు క్రెడిట్ సూపర్‌స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జునదేనని బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ స్పష్టం చేశారు. తాను ఈ చిత్రంలో ఒక ‘అతిథి’ పాత్రలో మాత్రమే నటించానని, ప్రేక్షకులు థియేటర్లకు పెద్ద ఎత్తున రావడం రజనీకాంత్ మరియు నాగార్జున కోసం మాత్రమేనని వినమ్రంగా పేర్కొన్నారు.

లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో తన పారితోషికంపై వస్తున్న రూమర్స్‌కి కూడా ఆమిర్ సమాధానం ఇచ్చారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “నేను ‘కూలీ’ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. రజనీకాంత్ గారిపై నాకు ఉన్న అపారమైన అభిమానానికి, గౌరవానికి ఎలాంటి విలువ చెప్పలేం. ఆయనతో కలిసి నటించడం నాకు లభించిన గొప్ప గౌరవం, బహుమతి” అని తెలిపారు.

Pawan Kalyan : రజనీకాంత్‌కి పవన్ కల్యాణ్ స్పెషల్ మెసేజ్!

ఆమిర్ ఖాన్ ‘కూలీ’లో ‘దాహా’ అనే పాత్రలో కనిపించారు. అయితే, గత కొన్ని రోజులుగా ఆయన ఈ గెస్ట్ రోల్‌కి ఏకంగా రూ. 20 కోట్లు పారితోషికం తీసుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. చిత్రబృందం ఈ వార్తలను ఖండించినప్పటికీ, రూమర్స్ ఆగలేదు. ఇప్పుడు ఆమిర్ స్వయంగా స్పందించడం వల్ల ఈ వాదనలకు పూర్తిగా ముగింపు పలికినట్టైంది.

ఆగస్టు 14న విడుదలైన ‘కూలీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 151 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, స్టార్ కాస్ట్, మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమా, రజనీకాంత్–నాగార్జున కాంబోని మళ్లీ థియేటర్లలో ఘనంగా చూడాలనుకున్న అభిమానులకు పండుగలా మారింది.

Charan House : రాజ భవనాన్ని తలపించేలా రామ్ చరణ్ ఇల్లు..ఇంటి ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!