మెగా డాటర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటుంది. తన డైలీ లైఫ్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేసి ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది. ప్రస్తుతం నిహారిక తన లేటెస్ట్ క్లిక్స్ తో నెటిజన్స్ ను అట్రాక్ట్ చేసింది. టర్కీ టూర్ లో నిహారిక ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసింది. క్రేజీ ఫ్యాషన్ దుస్తులు కనిపించడంతో పాటు ఇటీవలి తన వెకెషన్ కు సంబంధించిన త్రోబ్యాక్ చిత్రాలను షేర్ చేసింది.
అక్కడ తన స్నేహితులతో స్విమ్మింగ్, సెయిలింగ్, నేచర్ తో గడిపిన పిక్స్ ను పంచుకుంది. సముద్రం ఒడ్డులో, టాప్ బికినీ వేసుకొని ఆకట్టుకుంది. నిహారిక దాదాపు 5 సంవత్సరాల క్రితం వేసుకున్న టాటూ ప్రత్యేకార్షణగా నిలిచింది. సమంత, నయనతార, తాప్సీ టాటూల మాదిగా నిహారిక వేసుకుంది. ప్రస్తుతం నిహారిక పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.