Viral : సంచలనంగా మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కూతురు బికిని పిక్స్

Viral : బీహార్‌లోని భాగల్‌పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా సేవలందిస్తున్న అజయ్ శర్మ కుమార్తె నేహా శర్మ హాట్ ఫోటోలు విడుదల చేయడం కొన్ని వర్గాలకు ఇబ్బందిగా మారింది

Published By: HashtagU Telugu Desk
Neha Bikini

Neha Bikini

తెలుగు ప్రేక్షకులకు “చిరుత” (Chirutha) చిత్రంతో పరిచయమైన నేహా శర్మ (Neha Sharma) తాజాగా తన సోషల్ మీడియా పోస్ట్‌లతో సంచలనం రేపుతోంది. ప్రస్తుతం మాల్దీవ్స్‌లో వెకేషన్ (Vacation in the Maldives) ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ, తన బోల్డ్ బికినీ ఫోటోలను (Bikini Pics) సోషల్ మీడియాలో షేర్ చేసింది. వైట్ కలర్ బికినీలో సముద్ర తీరంలో నేహా తీయించుకున్న ఫోటోలు అభిమానులను కట్టిపడేస్తున్నాయి. “కాలం నిలిచిపోయి ప్రతి క్షణం ఒక వెచ్చని ఆలింగనంలా అనిపించింది” అనే క్యాప్షన్‌తో ఫోటోలు షేర్ చేయడం ద్వారా, ఆమె తన హాలీడే మూమెంట్‌ను ఎమోషనల్‌గా ప్రజెంట్ చేసింది.

World Most Powerful Country: 2025లో అత్యంత శక్తివంతమైన దేశాలు, వాటి సైనిక శక్తి వివరాలివే!

అయితే ఈ బోల్డ్ లుక్స్ ఆమె తండ్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే అజయ్ శర్మను రాజకీయంగా చిక్కుల్లోకి పడేసింది. బీహార్‌లోని భాగల్‌పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా సేవలందిస్తున్న అజయ్ శర్మ కుమార్తె నేహా శర్మ హాట్ ఫోటోలు విడుదల చేయడం కొన్ని వర్గాలకు ఇబ్బందిగా మారింది. ఒక రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తిగా నేహా సోషల్ మీడియాలో ఇటువంటి ఫోటోలు షేర్ చేయడం కొందరిలో విమర్శలకు దారితీస్తోంది. గతంలో నేహా రాజకీయాల్లోకి వస్తుందని ఊహాగానాలు జరిగినా, చివరికి ఆమె తండ్రే ఎన్నికల్లో పోటీ చేశారు.

ఇక నేహా షేర్ చేసిన బికినీ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. నేహా గ్లామర్ షోకు అభిమానులు ఫిదా అవుతున్నారు. క్లీవేజ్ మరియు థై షోతో హాట్‌నెస్ పెంచిన ఈ ఫోటోలకు ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతమైన లైక్స్‌, కామెంట్స్‌ వస్తున్నాయి. కొందరు నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తుంటే, మరికొంతమంది ఆమె తండ్రిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదైనా, నేహా శర్మ బికినీ లుక్స్‌తో మరోసారి హెడ్లైన్‌ల్లోకి ఎక్కినట్లు మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.

  Last Updated: 17 Apr 2025, 11:00 AM IST