Site icon HashtagU Telugu

Rashmika Mandanna: రష్మిక పై మండిపడిన ఎమ్మెల్యే.. గుణపాఠం చెప్పాలి అంటూ!

Rashmika Mandanna

Rashmika Mandanna

టాలీవుడ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు రష్మిక మందన. అందులో భాగంగానే ఇటీవలే పుష్ప 2 మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది రష్మిక. ఇది ఇలా ఉంటే తాజాగా రష్మికపై కర్ణాటకలోని మండ్యాకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రవి గనిగ మండిపడ్డారు. ఆమె తీరును విమర్శిస్తూ తాజాగా జరిగిన ప్రెస్‌మీట్‌ లో వ్యాఖ్యలు చేశారు.

బెంగళూరు వేదికగా జరుగుతోన్న ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఆమె అంగీకరించలేదని ఆరోపించారు. ఆమెకు సరైన గుణపాఠం చెప్పాలని అన్నారు. కెరీర్‌ను ఇచ్చిన ఇండస్ట్రీని గౌరవించడం ఆమె తెలుసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కిరిక్‌ పార్టీ అనే కన్నడ సినిమాతో ఈ రాష్ట్రంలోనే తన కెరీర్‌ ను ప్రారంభించారు నటి రష్మిక. ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ కు హాజరు కావాలని కోరుతూ గత ఏడాది మేము ఎన్నోసార్లు ఆమెను సంప్రదించాము.

ఆమె రానని.. కర్ణాటక వచ్చేంత సమయం తనకు లేదని చెప్పింది. అంతేకాకుండా మా ఇల్లు హైదరాబాద్‌ లో ఉంది. కర్ణాటక ఎక్కడో నాకు తెలియదు అన్నట్లు ఆమె మాట్లాడింది. నాకు తెలిసిన మరి కొంతమంది కూడా సుమారు పదిసార్లు ఆమెను కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. కానీ ఆమె మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదు. కన్నడ చిత్రపరిశ్రమ, భాష పట్ల ఆమె అగౌరవంగా వ్యవహరిస్తున్నారు. ఆమెకు సరైన పాఠం నేర్పించాల్సిన అవసరం లేదా?అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఆయన వ్యాఖ్యలపై హీరోయిన్ రష్మిక ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.