Palash Muchhal: స్మృతి మంధాన చిన్ననాటి ఫ్రెండ్‌ ఫిర్యాదు.. పలాశ్ ముచ్చల్‌పై అట్రాసిటీ కేసు నమోదు..

ప్రముఖ సంగీత దర్శకుడు, ఫిల్మ్‌మేకర్ పలాశ్‌ ముచ్చల్‌పై చీటింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. సినిమా ప్రాజెక్టు పేరుతో రూ. 25 లక్షలు తీసుకుని మోసం చేయడమే కాకుండా కులం పేరుతో దూషించాడంటూ సామాజిక కార్యకర్త విజ్ఞాన్ మానే మహారాష్ట్రలోని సాంగ్లీ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజ్ఞాన్ మానే.. భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానకు చిన్ననాటి స్నేహితుడు కావడం గమనార్హం. విజ్ఞాన్ మానే ఫిర్యాదు ప్రకారం 2024లో ‘నజరియా’ […]

Published By: HashtagU Telugu Desk
Atrocities Act case has reportedly been registered against Palash Muchhal

Atrocities Act case has reportedly been registered against Palash Muchhal

ప్రముఖ సంగీత దర్శకుడు, ఫిల్మ్‌మేకర్ పలాశ్‌ ముచ్చల్‌పై చీటింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. సినిమా ప్రాజెక్టు పేరుతో రూ. 25 లక్షలు తీసుకుని మోసం చేయడమే కాకుండా కులం పేరుతో దూషించాడంటూ సామాజిక కార్యకర్త విజ్ఞాన్ మానే మహారాష్ట్రలోని సాంగ్లీ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజ్ఞాన్ మానే.. భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానకు చిన్ననాటి స్నేహితుడు కావడం గమనార్హం.

విజ్ఞాన్ మానే ఫిర్యాదు ప్రకారం 2024లో ‘నజరియా’ అనే సినిమా ప్రాజెక్టులో పెట్టుబడి పేరుతో పలాశ్ ముచ్చల్ తన వద్ద నుంచి రూ. 25 లక్షలు తీసుకున్నారు. మంచి లాభాలు వస్తాయని హామీ ఇచ్చినా, సినిమా పూర్తయిన తర్వాత డబ్బు తిరిగి ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు. 2025 నవంబర్ 22న సాంగ్లీలో పలాశ్‌ను కలిసినప్పుడు, డబ్బు తిరిగివ్వమని అడగగా తమను మోసం చేశాడని అర్థమైందని చెప్పారు.

ఈ క్రమంలో పలాశ్ ఒక నిర్దిష్ట సామాజిక వర్గాన్ని కించపరిచేలా తీవ్రమైన కుల దూషణలకు పాల్పడ్డాడని విజ్ఞాన్ తన ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. అంతేగాక‌ ముంబైలోని తన కాంటాక్ట్స్‌తో భౌతిక దాడులు చేయిస్తానని బెదిరించాడని, దీనివల్ల తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని తెలిపారు. ఈ కుల వివక్ష వ్యాఖ్యలతో తీవ్రంగా నొచ్చుకున్నానని, అందుకే చట్టపరమైన చర్యలకు ఉపక్రమించానని వివరించారు.

విజ్ఞాన్ మానే ఫిర్యాదు మేరకు సాంగ్లీ నగర పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం 2012లోని సెక్షన్ 3(1)(R)(S)తో పాటు, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్‌)లోని సెక్షన్లు 351, 302, 352 కింద కేసు నమోదు చేశారు. పలాశ్ ముచ్చల్‌ను అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ముంబైకి పంపినట్లు వెల్లడించారు. ఈ విషయంపై దర్యాప్తు కొనసాగుతోంది.

కాగా, పలాశ్ ముచ్చల్, స్మృతి మంధానల వివాహం 2025 నవంబర్ 23న సాంగ్లీలో జరగాల్సి ఉండగా, చివరి నిమిషంలో రద్దయింది. స్మృతి తండ్రి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడం, అదే సమయంలో పలాశ్ కూడా వైరల్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరడంతో పెళ్లి వాయిదా పడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత డిసెంబర్ 7న వారిద్దరూ తమ వివాహం రద్దయినట్లు అధికారికంగా ప్రకటించారు.

  Last Updated: 06 May 2026, 01:02 PM IST