HanuMan vs Adipurush: ఆదిపురుష్ వర్సెస్ హనుమాన్

ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కిన ప్రభాస్ ఆదిపురుష్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ప్రభాస్ రాముడు అనగానే ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి

HanuMan vs Adipurush: ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కిన ప్రభాస్ ఆదిపురుష్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ప్రభాస్ రాముడు అనగానే ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ టీజర్ రిలీజ్ తర్వాత బొమ్మల సినిమా అని, రామాయణాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. ఆ గ్రాఫిక్స్, విజువల్స్ కూడా అస్సలు బాగోలేవు అని విమర్శించారు. ఆఖరికి సినిమా రిలీజ్ అయ్యాక సినిమాని ఎంత చెత్తగా చిత్రికరించారో అర్థమైంది.

తేజ సజ్జ హీరోగా సరికొత్త సినిమాలతో కథలు తీసే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. బలమైన కథతో పాటుగా గ్రాఫిక్స్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. హనుమాన్ ని దేవుడిలాగే అందరూ ఊహించే శక్తివంతుడిలాగే చూపెట్టారు. మొత్తానికి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

ఆదిపురుష్‌ మూవీని దాదాపు 300 కోట్లు ఖర్చుపెట్టి తీసారు కానీ.. గ్రాఫిక్స్ మాత్రం అనుకున్నతంగా లేకపోవడంతో ఓంరౌత్ పై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు హనుమాన్ సినిమా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ 25 కోట్లు. ఇది దర్శకుడు చెప్పిన బడ్జెట్. అయితే.. నిర్మాత 50 కోట్లు అయ్యిందని చెప్పారు. ఒకవేళ నిర్మాత చెప్పినట్టే.. 50 కోట్లు అయినా.. క్వాలిటీ చూస్తే మాత్రం 50 కోట్లు కాదు.. 300 కోట్లు అయినట్టుగా ఉంది. బాలీవుడ్ జనాలు ఈ సినిమా చూసి ఇంత తక్కువ బడ్జెట్ తో అంత క్వాలిటీలో ఎలా తీసారు సినిమాను అని షాక్ అవుతున్నారు. అయితే.. ఇక్కడే నెట్టింట్లో ఓంరౌత్ గుర్తొచ్చాడు. అంతే.. తక్కువ బడ్జెట్ తో క్వాలిటీ కంటెంట్ ఎలా తీయాలో హనుమాన్ సినిమాను చూసి.. ప్రశాంత్ వర్మను చూసి.. నేర్చుకో అంటూ ఓంరౌత్ పై విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు. ఆదిపురుష్ వచ్చింది. వెళ్లిపోయింది.. అప్పుడు విమర్శలు వచ్చాయి.

ఆ సినిమా రిలీజై చాలా రోజులు అయ్యింది. అయినప్పటికీ ఇంకా వదలకుండా ఓంరౌత్ పై నేటికీ ఇలా విమర్శలు చేస్తున్నారు. దీనిని బట్టి ఓంరౌత్ ఎంతలా ఆదిపురుష్ మూవీతో నిరాశపరిచారో అర్థం చేసుకోవచ్చు. పాపం.. ఓంరౌత్ ప్రశాంతంగా ఉండాలి అనుకుంటుంటే.. ఇప్పుడు హనుమాన్ మూవీ వచ్చి మళ్లీ డిస్ట్రిబ్ చేస్తుంది. హనుమాన్ మూవీ నార్త్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా కోసం ప్రశాంత్ వర్మ పడిన కష్టం ఫలించింది. బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుని దూసుకెళుతుంది. మరి.. ఓంరౌత్ ఎప్పుడు ఈ విమర్శల నుంచి బయటపడతాడో.

Also Read: Octopus and Swat: ఉగ్రవాదంపై ఏకమైన ఆక్టోపస్, స్వాట్