Site icon HashtagU Telugu

Mahesh Babu : మహేష్ ఈ 3 నెలలు బిజీ బిజీ.. రాజమౌళి సినిమా స్టార్ట్ ఎప్పుడంటే..?

New Title Circulating In Social Media Mahesh Rajamouli Movie

New Title Circulating In Social Media Mahesh Rajamouli Movie

Mahesh Babu సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి సినిమా కోసం రెడీ అయ్యే క్రమంలో రానున్న 3 నెలలు బిజీ బిజీగా ఉండనున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే మహేష్ తన లుక్ మార్చుకునే ప్రాసెస్ లో ఉండగా 3 నెలల్లో పూర్తిగా వర్క్ అవుట్స్ చేస్తాడని తెలుస్తుంది. రాజమౌళి సినిమాకు కావాల్సిన దేహ దారుడ్యాన్ని సిద్ధం చేసేందుకు 3 నెలలు టైం తీసుకుంటున్నాడట మహేష్.

అంతేకాదు ఈ 3 నెలల్లోనే యాడ్స్ కు సంబందించిన ఏడాది కమిట్మెంట్స్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడట. రాజమౌళి సినిమా మొదలు పెడితే మొత్తం టైం దానికే కేటాయించాల్సి ఉంటుంది. అందుకే మహేష్ కి బాడీ బిల్డప్ తో పాటుగా తన యాడ్ షూట్ కోసం రాజమౌళి ఈ 3 నెలలు టైం ఇచ్చాడట.

ఇక సినిమాను జూన్ మొదటి వారంలో సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది. ఈలోగా వర్క్ షాప్ కూడా సిద్ధం చేస్తారని టాక్. కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తారని టాక్. మహేష్ సినిమాను రాజమౌళి భారీ ప్లానింగ్ తో తెరకెక్కించనున్నాడని చెప్పుకుంటున్నారు.

అయితే ఓపెనింగ్ రోజే సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారట. కానీ జక్కన్న రిలీజ్ అనౌన్స్ చేసిన ఏ డేట్ కి సినిమాను తీసుకు రాలేదు. మరి మహేష్ సినిమా విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

Also Read : Yeshaswi fire on Music Director Radhan : చెన్నైలో ఉండి బ్రతికిపోయాడు.. లేకపోతే చాలా గొడవలయ్యేవి.. మ్యూజిక్ డైరెక్టర్ పై డైరెక్టర్ ఫైర్..!