Site icon HashtagU Telugu

Comedian Sudhakar: కమెడియన్ సుధాకర్ కుమారుడి పెళ్లి తంతు జరిపించిన బ్రహ్మానందం.. స్నేహితుడి కోసం అన్నీ తానై?

Comedian Sudhakar Son Benny Marriage Photos 13

Comedian Sudhakar Son Benny Marriage Photos 13

తెలుగు ప్రేక్షకులకు ఒకప్పటి కమెడియన్ సుధాకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని వందల సినిమాలలో కమెడియన్ గా నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం కన్నడ సినిమాల్లో కూడా నటించి మెప్పించారు.కమెడియన్ గా మాత్రమే కాకుండా హీరోగా కూడా పలు సినిమాలలో నటించారు సుధాకర్. మొదట హీరోగా చేసి ఆ తర్వాత కమెడియన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. వందలాది చిత్రాల్లో నటించిన ఆయన ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇలా సాగుతున్న క్రమంలో అనారోగ్యానికి గురై ఇంటికే పరిమితమ్యారు నటుడు సుధాకర్. ఈ మధ్యకాలంలో వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ వార్తల్లో నిలుస్తున్నారు సుధాకర్. అయితే అనారోగ్య పరిస్థితుల కారణంగా సినిమాలకు పూర్తిగా దూరమైన సుధాకర్ ప్రస్తుతం గుర్తుపట్టలేని విధంగా మారిపోయాడు. ఆరోగ్యం క్షీణించడంతో బక్క చిక్కిపోయి నడవడానికి కూడా లేని పరిస్థితుల్లో సుధాకర్‌ను చూసి బాధపడ్డారు. అయితే తాజాగా సూధాకర్ కుమారుడు బెనిడిక్ మైఖేల్ వివాహం జరిగింది. ఈ వేడుకకి టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహ వేడుక‌కి జ‌గ‌ప‌తి బాబు, బ్ర‌హ్మానందం, జేడీ చక్రవర్తి, రోజా రమణి, చంద్ర‌బోస్ దంప‌తులు సహా పలువురు సెలబ్రెటీలు హాజరయ్యారు.

ఇక బ్రహ్మానందం అయితే తన స్నేహితుడి కొడుకు పెళ్లి దగ్గరుండి మరి చేశారు. పెళ్లి పనులు మొదలైనప్పటి నుంచి అక్కడే ఉన్న బ్రహ్మీ రిసెప్షన్‌లో కూడా సందడిగా కనిపించారు. పెళ్లి జంటతో కూడా జోకులు వేస్తూ అందరినీ నవ్వించారు. సుధాకర్‌ పక్కన కూర్చొని పెళ్లి తతంగం అంతా దగ్గరుండి జరిపించారు. ఈ వివాహ వేడుకకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఫిబ్ర‌వరి రెండో వారంలో ఈ పెళ్లి జరిగిన‌ట్లు తెలుస్తోంది. కానీ పెళ్లి ఫోటోలు, వీడియోలు రీసెంట్‌గానే బయటికి వచ్చాయి. ఈ ఫొటోల్లో సుధాక‌ర్ ప‌రిస్థితి మరింత దారుణంగా కనిపించింది. అసల న‌డ‌వ‌లేని స్థితిలో ఉన్న ఆయ‌న్ను ఇద్దరి సాయంతో స్టేజీపైకి తీసుకొచ్చారు. ఆయ‌న సినిమాల‌కు దూర‌మై సుమారు 17 ఏళ్లు అవుతోంది. చివరిగా నితిన్ నటించిన ద్రోణ సినిమాలో ఆయన కనిపించారు.

Exit mobile version