ఒకప్పటి స్టార్ కమెడియన్ బేత సుధాకర్(Sudhakar) అందరికి గుర్తుకు ఉండే ఉంటారు. ఫన్నీ హావభావాలతో ప్రేక్షకులను ఎన్నో ఏళ్ళ పాటు నవ్విస్తూ వచ్చిన ఆయన.. వయసు పెరగడం, అవకాశాలు తగ్గడంతో గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇటీవల ఆయన చనిపోయారు అంటూ పుకార్లు చక్కర్లు కొట్టడంతో సుధాకర్.. తాను బతికే ఉన్నట్లు ఒక వీడియో ద్వారా తెలియజేశారు. ఇక చాలా రోజులు తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధాకర్ ని గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించారు.
ఇటీవల సుధాకర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను తెలియజేశారు. సినిమా అవకాశాలు కోసం ప్రయత్నిస్తున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నారాయణరావు, హరిప్రసాద్‌లు కలిసి ఒకే రూమ్ లో ఉండేవారు. దీంతో చిరంజీవి, సుధాకర్ మధ్య మంచి స్నేహం ఉండేది. ఈ స్నేహంతోనే చిరంజీవి సూపర్ హిట్ సినిమా ‘యముడికి మొగుడు’కి నిర్మాతగా అవకాశం ఇచ్చాడు. ఇక అదే సినిమాలో సుధాకర్ ఒక పాత్ర కూడా చేశారు.
ఆ పాత్ర చిరంజీవి బలవంతం చేయడంతో చేశారట సుధాకర్. తాను చేయనంటూ ఎంత చెప్పినా చిరంజీవి వినకపోవడంతో చేసేది లేక చివరికి సుధాకర్ నటించారు. అయితే ఆ పాత్రతో తనకి ఎంతో గుర్తింపు వచ్చినట్లు ఆయన తెలియజేశాడు. ఆ పాత్ర తర్వాతే తనకు చాలా అవకాశాలు వచ్చినట్టు తెలిపాడు. హీరోగా, కమెడియన్ గా.. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో 600 పైగా సినిమాల్లో నటించారు. కమెడియన్ గా రెండు నంది అవార్డులను కూడా అందుకున్నారు. అలాగే నిర్మాతగా 4 సినిమాలను నిర్మించారు. అయితే ప్రొడ్యూసర్ గా తెరకెక్కించిన మొదటి సినిమా ‘యముడికి మొగుడు’ బ్లాక్ బస్టర్ అయ్యినప్పటికీ ఆయన ఎందుకో నిర్మాణం వైపు పెద్దగా ఆసక్తి చూపలేదు. త్వరలోనే ఈయన కొడుకు బన్నీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
Also Read : Minister Roja : చరణ్‌కి కూతురు పుట్టినందుకు రోజా స్పెషల్ ట్వీట్.. చరణ్‌ని చిన్నప్పుడు ఎత్తుకున్నాను అంటూ..