Site icon HashtagU Telugu

Krishna-Vijaya Nirmala : రాజబాబు అన్న సరదా మాట.. కృష్ణ రెండో పెళ్లికి బీజం అయ్యింది..

Comedian Rajababu Talk about Krishna Vijaya Nirmala Second Marriage before 2 Years

Comedian Rajababu Talk about Krishna Vijaya Nirmala Second Marriage before 2 Years

సూపర్ స్టార్ కృష్ణ(Krishna).. విజయనిర్మలను(Vijaya Nirmala) రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో ఈ జంట డేరింగ్ అండ్ డాషింగ్ కపుల్ గా పిలిపించుకున్నారు. ఈ జోడికి మరో పేరు కూడా ఉండేది. వీరిద్దర్నీ ‘ఆంధ్రా ప్రేమ్‌ నజీర్‌-షీలా’గా పిలిచేవారు. కాగా కృష్ణ, విజయనిర్మల ప్రేమ వెనుక.. ఒకప్పటి స్టార్ కమెడియన్ రాజబాబు(Rajababu) అన్న ఓ సరదా మాట ఉందట. ఆ మాటతోనే కృష్ణ-విజయనిర్మల పెళ్ళికి బీజం పడింది. ఇంతకీ ఆ మాట ఏంటి..?

ఈ విషయాన్ని స్వయంగా కృష్ణనే ఓ సందర్భంలో తెలియజేశారు. కృష్ణ, విజయనిర్మల కలిసి మొదటిసారి ‘సాక్షి’ అనే సినిమాలో నటించారు. 1967లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బాపు తెరకెక్కించారు. ఈ సినిమాలో రాజబాబు ఓ ముఖ్య పాత్ర చేశారు. కాగా ఈ మూవీ షూటింగ్ అంతా రాజమండ్రి దగ్గరలోని పులిదిండిలో జరిగిందట. ఇక ఈ సినిమాలోని ‘అమ్మ కడుపు చల్లగా’ అనే సూపర్ హిట్ సాంగ్ షూటింగ్ ఆ ఊర్లో ఉన్న ‘మీసాల కృష్ణుడు’ గుడిలో జరిగిందట.

పెళ్లి వేడుక నేపథ్యంతో ఈ సాంగ్ చిత్రీకరణ ఉంటుంది. ఇక సినిమా షూటింగ్ అయినా.. ప్రతి విషయాన్ని శాస్త్రోక్తంగా చేసే బాపు.. ఆ పెళ్లి తతంగం మొత్తాన్నీ నిజమైన పెళ్లిలా జరిపించారు. ఈక్రమంలోనే కృష్ణ-విజయనిర్మలకు శాస్త్రోక్తంగా ఆ గుడిలో అబద్ధపు పెళ్లి జరిగింది. ఇక ఆ పాటని తెరకెక్కిస్తున్న సమయంలో కృష్ణతో రాజబాబు ఇలా అన్నారట.. “ఈ గుడి చాలా మహిమగలది అంట. ఇప్పుడు అబద్ధపు పెళ్లి చేసుకున్న మీరు. త్వరలోనే నిజం పెళ్లి చేసుకుంటారు” అంటూ సరదాగా మాట్లాడారట.

ఆ మాటలకు సెట్స్ లోని ప్రతి ఒక్కరు నవ్వుకున్నారట. కానీ ఆ తరువాత రెండేళ్లకే 1969 మార్చి 24న కృష్ణ-విజయనిర్మల తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. ఒక సందర్భంలో కృష్ణ తమ పెళ్లి గురించి మాట్లాడుతూ.. రాజబాబు మాటల్ని గుర్తు చేసుకున్నారు. “నేను సెంటిమెంట్స్ ని నమ్మను. కానీ రాజబాబు అన్న మాటలు నిజంగా జరిగినప్పుడు ఆశ్చర్యపోయాను” అంటూ కృష్ణ చెప్పుకొచ్చారు.

 

Also Read : Telugu Music Directors : పదిమంది మ్యూజిక్ డైరెక్టర్స్ కలిసి పాడిన.. ఆర్పీ పట్నాయక్ కోసం.. ఆ పాట ఏంటో తెలుసా..?