Site icon HashtagU Telugu

Comedian Ali : రాజకీయాలకు గుడ్ బై చెప్పిన అలీ

Ali Good Bai

Ali Good Bai

సినీ నటుడు , వైసీపీ నేత అలీ (Comedian Ali ) రాజకీయాలకు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం తాను ఏ పార్టీలో లేనని స్పష్టం చేస్తూ వీడియో సందేశం ఇచ్చారు. సినిమా పరిశ్రమ నాకు అన్నం పెట్టింది. ఒకొక్క మెట్టు ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చాను. నిర్మాత డి.రామానాయుడు కోసం టీడీపీ హయాంలో 1999లో రాజకీయాల్లో అడుగుపెట్టా.

We’re now on WhatsApp. Click to Join.

బాలనటుడిగా అనేక సినిమాలు చేసిన తర్వాత, ఒక వయసు వచ్చిన నేపథ్యంలో, ప్రేమఖైదీ చిత్రం ద్వారా అవకాశం ఇచ్చి నన్ను నటుడుగా నిలబెట్టిన వ్యక్తి నిర్మాత రామానాయుడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన తర్వాత, ప్రేమఖైదీ చిత్రంతో నా కెరీర్ లో మరో అధ్యాయం మొదలైంది. రామానాయుడు బాపట్ల నుంచి ఎంపీగా పోటీ చేస్తూ… నువ్వు కూడా రావాలి రా అనడంతో ఆనాడు ఆయన కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. మీ కోసం తప్పకుండా వస్తాను గురువు గారూ! మీ సినిమా ప్రేమ ఖైదీ తర్వాతే మళ్లీ ఒక ఆర్టిస్ట్ గా మరో మెట్టుకు ఎదిగాను… మీ కోసం తప్పకుండా వస్తాను అని చెప్పి టీడీపీ హయాంలో రాజకీయాల్లోకి వెళ్లాను.

పది మందికి సాయపడటం కోసమే రాజకీయాల్లోకి వచ్చా. మా నాన్న గారితో పేరుతో ట్రస్ట్ పెట్టి ఎంతో మందికి సేవ చేశాను. ‘నేను ఏ పార్టీలో వున్నా వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించలేదు. ప్రస్తుతం నేను ఏ పార్టీ మనిషిని కాదు. ఏ పార్టీ సపోర్ట్ ని కాదు. ఓ సామాన్యుడిని మాత్రమే. ఇక నుండి నా సినిమాలు, షూటింగులు చేసుకుంటాను. ఐదేళ్లకు ఒక్కసారి వచ్చే ఎన్నికల్లో ఓ కామన్ మ్యాన్ గా వెళ్లి ఓటు వేసి వస్తా” ఇక రాజకీయాలకు నాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసారు.

Read Also : T20 World Cup Final : సఫారీలతో టైటిల్ పోరు…భారత తుది జట్టులో మార్పులుంటాయా ?