Comedian Ali : అలీ ‘చాట’ డైలాగ్ వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా..?

‘రాజేంద్రుడు గజేంద్రుడు’ సినిమాలో అలీ.. 'చాట' అనే ఒక్క డైలాగ్ తో ఆడియన్స్ ని బాగా నవ్వించాడు.

Published By: HashtagU Telugu Desk
Comedian Ali Famous Dailogue Enda Chata Hilarious Back Story

Comedian Ali Famous Dailogue Enda Chata Hilarious Back Story

టాలీవుడ్ కమెడియన్ అలీ(Comedian Ali ).. తన ప్రత్యేక హావభావాలతో, డైలాగ్స్‌తో ఆడియన్స్ ని విపరీతంగా నవ్విస్తుంటాడు. ఈక్రమంలోనే రాజేంద్రప్రసాద్ హీరోగా తెరకెక్కిన ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ సినిమాలో అలీ.. ‘చాట’ అనే ఒక్క డైలాగ్ తో ఆడియన్స్ ని బాగా నవ్వించాడు. ఇంతకీ అసలు ఆ డైలాగ్ వెనుక ఉన్న కథ ఏంటి..? అది ఏ భాషకి సంబంధించిన పదం..? ఈ విషయాలను అలీ ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు.

‘మగాడు’ అనే సినిమా షూటింగ్ కోసం అలీ కేరళలోని(Kerala) ఎర్నాకుళం వెళ్ళాడట. ఇక ఒకరోజు చిత్రీకరణ పూర్తి చేసుకున్న అలీ.. షూటింగ్ సెట్స్ నుంచి ఒంటరిగా తను బస చేస్తున్న హోటల్ కి బయలుదేరాడు. అయితే ఆ హోటల్ పేరు అలీకి గుర్తులేదంట, అడ్రస్ కార్డు కూడా లేదు. ఆ హోటల్ దగ్గర ఒక మార్కెట్ ఉందన్న విషయం మాత్రం గుర్తు ఉందట. దీంతో ఆటో వాడిని పిలిచి మార్కెట్ అని చెప్పాడట.

అది విన్న ఆటోవాడు.. “ఎన్న చాట మార్కెట్‌, అడ్రస్‌ ఇల్లిల్లో’ అంటూ మలయాళంలో ఏదో మాట్లాడంట. అది ఆలీకి అర్ధంకాక.. ‘హా ఆ చాటే’ అని చెప్పి ఆటో ఎక్కేశాడంట. చివరికి ఏదోరకంగా ముప్పతిప్పలు పడి హోటల్ కి చేరుకున్నాడు. ఇక కొన్నిరోజులు కేరళలోనే ఉండడంతో అక్కడ యాస అలవాటు అయ్యింది. ఆ యాసతోనే ‘జంబలకిడి పంబ’ సినిమా షూటింగ్ సమయంలో నటి చంద్రికతో అలీ.. ‘ఎవడే చంద్రిక, ఎవడే పైలిల్లో’ అని సరదాగా మాట్లాడంట. అది విన్న రచయిత దివాకర్‌బాబు.. ఇదేదో బాగుంది సినిమాల్లో వాడేద్దాం అన్నాడట.

ఆ తరువాత రచయిత దివాకర్‌బాబు, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ సినిమాలో ఆలీకి, బ్రహ్మానందంకి మధ్య సీన్స్ రాసుకున్నారు. ఆ సన్నివేశంలో బ్రహ్మానందంకి డైలాగ్స్ రాశారు గాని, అలీకి రాయలేదు. నా డైలాగ్స్ ఏవి అని అలీ అడిగితే.. మలయాళ యాసలో నువ్వు కొన్ని మాటలు మాట్లాడతావుగా, అవే నీ డైలాగ్స్ అంటూ బదులిచ్చాడు. దీంతో సీన్ లో అలీ తన చాట భాషతో బ్రహ్మానందంని ముప్పతిప్పలు పెట్టాడు. సెట్స్ లో ఆ సీన్ చూసిన ప్రతి ఒక్కరు.. వారి చేసే పని వదిలేసి నువ్వుకున్నారట. ఇక థియేటర్ లో కూడా అదే రేంజ్ లో ఆ సీన్ పండింది. అప్పట్నుంచి అలీ ఎంద చాట డైలాగ్స్ బాగా వైరల్ అయ్యాయి.

 

Also Read : Chiranjeevi : ఆ కారణంతో ఎన్టీఆర్, శోభన్ బాబు సినిమాల్లో.. చిరంజీవికి అవకాశం ఇచ్చిన రాఘవేంద్రరావు..

  Last Updated: 21 Oct 2023, 09:12 PM IST