Site icon HashtagU Telugu

Charan to Sam: సమంతకు సపోర్ట్.. ‘బిగ్గర్ అండ్ స్ట్రాంగర్’ అంటూ రియాక్షన్!

Sam And Chran

Sam And Chran

నాగ చైతన్య నుంచి విడిపోతున్నట్లు ప్రకటించిన తరువాత నటి సమంతా ట్రోలింగ్‌కు గురైంది. ఎన్నో పుకార్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ కొంతమంది సినీ ప్రముఖులు, హీరోలు ఆమెకు మద్దతు నిలిచారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ను “ఈ రోజు మీరు సమంతను కలిస్తే మీరు ఏమి చెబుతారు?” అని అడిగినప్పుడు ” బిగ్గర్ అండ్ స్ట్రాంగర్ ” అంటూ ఆన్సర్ చేశారు. ఆ తర్వాత సమంత చరణ్ క్లిప్‌ను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

అక్టోబర్ 2 న విడాకుల ప్రకటన తర్వాత సమంత ఆ సయమంలో ఇలా స్పందించారు. “వ్యక్తిగత సంక్షోభంలో చాలా సపోర్ట్ గా నిలిచారు. తప్పుడు పుకార్లకు వ్యతిరేకంగా రక్షించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నాకు ఎఫైర్స్ ఉన్నాయని, పిల్లలు కోరుకోలేదని, నేను అవకాశవాదినని, ఇప్పుడు అబార్షన్ చేయించుకున్నానని చెప్పారు. విడాకులు అనేది చాలా బాధాకరమైన ప్రక్రియ. నాకు నయం కావడానికి సమయాన్ని ఇవ్వండి. వ్యక్తిగతంగా నాపై ఈ దాడి ఎడతెగనిది. వ్యక్తిగత పోస్టులతో నన్ను ఇబ్బంది పెట్టకండి’’ అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చారు.

సమంత ప్రస్తుతం విజయ్ సేతుపతి, నయనతార ప్రధాన పాత్రలలో నటించిన విఘ్నేష్ శివన్  రాబోయే తమిళ రొమాంటిక్ డ్రామా కాతు వాకుల రెండు కాదల్‌లో నటిస్తోంది. పీరియాడికల్ డ్రామా శాకుంతలం కూడా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో ఆమె టైటిల్ రోల్‌ ప్లే చేస్తోంది. అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ అనే టైటిల్‌తో రూపొందిన హలీవుడ్ మూవీలో సమంత ద్విలింగ తమిళ మహిళగా నటించనుంది.