‘కలర్ ఫోటో’ ఫేమ్ దర్శకుడు సందీప్ రాజ్ (Color Photo Director Sandeep Raj ), నటి చాందినీ రావు (Chandini Rao) శనివారం తిరుమలలో పెళ్లి (Marriage ) చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు వైవా హర్ష, హీరో సుహాస్ మరియు పలువురు సినీ ప్రముఖులు హాజరై జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ కొత్త జంటకు కంగ్రాట్స్ చెపుతున్నారు. సందీప్ రాజ్.. ‘కలర్ ఫొటో’ సినిమాతో ప్రేక్షకులకు డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. ఈ సినిమాలో చాందినీ రావు కీ రోల్ పోషించగా, సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య పరిచయం పెరిగి, అది ప్రేమకు దారితీసింది. కొంతకాలం ప్రేమలో ఉన్న ఈ జంట, పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు.
‘కలర్ ఫొటో’ తర్వాత.. చాందినీ మరో కొన్ని ప్రాజెక్ట్స్‌లో నటించింది. ‘హెడ్స్ అండ్ టేల్స్’ అనే వెబ్ సిరీస్‌లోనూ నటించింది. తాజాగా విడుదలైన ‘రణస్థలి’లో కూడా మంచి పాత్రను పోషించింది. సందీప్ రాజ్ కూడా తన కెరీర్‌ను వెబ్ సిరీస్‌లు మరియు సినిమాలతో బిజీ గా ఉన్నారు. ‘హెడ్స్ అండ్ టేల్స్’ మరియు ‘ముఖ చిత్రం’ వంటి చిత్రాలకు కథలు అందించారు. ‘కలర్ ఫొటో’ సినిమాతో నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న సందీప్, ప్రస్తుతం ‘మోగ్లీ’ అనే సినిమాను రూపొందిస్తున్నారు. సందీప్ త్వరలో మాస్ మహారాజా రవితేజతో ఒక కొత్త సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మూడు ముళ్ళుతో ఒకటైన ‘కలర్ ఫోటో’ డైరెక్టర్ సందీప్ రాజ్, హీరోయిన్ చాందినీరావు. వీరిద్దరి పెళ్ళి తిరుమలలో ఘనంగా జరిగింది…. ఈ వేడుకకు హీరో సుహాస్ దంపతులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. #ColorPhoto #Suhas #sandeepraj #chandinirao #marriage #tollywood #HashtagU pic.twitter.com/eETnENVxKf
— Hashtag U (@HashtaguIn) December 7, 2024