Site icon HashtagU Telugu

Harsha Sai : హర్షసాయి వల్ల ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి – కో ప్రొడ్యూసర్

Harsha

Harsha

ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి (Youtuber Harsha Sai) వల్ల ఆత్మ హత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ కో ప్రొడ్యూసర్ వాపోతున్నాడు. హర్షసాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసాడని చెప్పి బిగ్ బాస్ ఫేమ్ , OTT నటి మిత్రా శర్మ పోలీసులకు పిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. హర్షసాయి తో పాటు అతడి తండ్రి రాధాకృష్ణ పై కూడా ఫిర్యాదులో పేర్కొంది. హర్ష తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి దాదాపు రూ. 2 కోట్లు తన దగ్గరి నుండి తీసుకున్నాడని..ఇప్పుడు డబ్బులు అడిగిన , పెళ్లి గురించి ప్రస్తావన తీసుకొచ్చిన ముఖంచాటేస్తున్నారని.. అలాగే తనను బ్లాక్ మెయిల్ చేయడం తో పాటు శారీరకంగా వాడుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.

తామిద్దరం ‘మెగా’ సినిమా చేశామని , ఈ మూవీ కాపీ రైట్స్‌ కోసం హర్ష పట్టుబడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. సినిమాకు బాధితురాలు నిర్మాతగా వ్యవహరించింది. మత్తుమందు ఇచ్చి తనపై అఘాయిత్యానికి పాల్పడినట్టు.. ఫిర్యాదులో రాసుకొచ్చింది. ఆ సమయంలో వీడియోలు తీసి.. కాపీరైట్స్‌ ఇవ్వకపోతే వీడియోలు వైరల్‌ చేస్తానని బెదిరిస్తున్నాడని ఆమె పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్‌లో తెలిపింది. ఈ పిర్యాదు నేపథ్యంలో పోలీసులు హర్షసాయి పై కేసు నమోదు చేసి అతడి కోసం గాలింపు చేస్తున్నారు.

ఇప్పుడు ఈ వివాదంలో హర్షసాయి.. బాధిత యువతితో పాటు.. ఆ మూవీ కో ప్రొడ్యూసర్ కూడా ఇరుక్కుపోయాడు. చిన్న వయసులో సొంత ఖర్చుతో హర్ష సాయిని.. ఆ యువతిని పెట్టి సినిమా ట్రైలర్ ను లాంచ్ చేశాడు. కానీ ఇంతలోనే ఈ వివాదం తెరపైకి వచ్చింది. హర్ష సాయి ని పెట్టి సినిమా తీద్దాం అనుకున్నందుకు తన జీవితం కూడా నాశనం అయిందంటూ కన్నీరు పెట్టుకున్నారు ఆ కో ప్రొడ్యూసర్. తానూ సూసైడ్ చేసుకునే పరిస్థితిల్లో ఉన్నానంటూ ఆ వ్యక్తి హర్ష సాయికి.. మెసేజ్ కూడా పెట్టనంటూ చెప్పుకొచ్చాడు. మరి ఇంకా ఈ కేసు విషయంలో ఎంత మంది బయటకు వస్తారో.. ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో తెలియాల్సి ఉంది.

Read Also : Bank Holidays in October 2024 : అక్టోబర్ లో బ్యాంకులకు ఏకంగా 14 రోజులు సెలవులు