Site icon HashtagU Telugu

Allu Arjun : అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం కష్టమేనా..? సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే..!!

Allu Arjun Arrest

Allu Arjun Arrest

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుతో ఒక్కసారిగా చిత్రసీమే కాదు యావత్ సినీ ప్రేక్షకులు షాక్ లో పడ్డారు. చిక్కడపల్లి పోలీసులు.. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై రెండు సెక్షన్ల కింద అల్లు అర్జున్‌పై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. వీటిలో 118(1) మరియు 105 సెక్షన్ల కింద కేసులు నమోదు కాగా, 105 సెక్షన్ కింద బెయిల్ రావడం కష్టమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

భారత న్యాయ సంహిత చట్టం ప్రకారం, 105 సెక్షన్ కింద నేరం రుజువు అయితే ఐదు నుంచి పదేళ్ల వరకు జైలుశిక్ష పొందే అవకాశం ఉంది. అలాగే 118(1) సెక్షన్ ప్రకారం కూడా నేరం రుజువు అయితే ఏడాది నుంచి పదేళ్ల వరకు శిక్ష పడవచ్చని చట్టం చెబుతుంది. అల్లు అర్జున్ తనను నిర్దోషిగా పేర్కొన్నప్పటికీ, ఈ కేసు విషయంలో పోలీసులు తీవ్రంగా చర్యలు తీసుకుంటున్నారు. అల్లు అర్జున్ పై కేసులు నమోదు కాగానేహైకోర్టును ఆశ్రయించి, తనపై పెట్టిన కేసులను కొట్టివేయాలని పిటిషన్ వేశాడు. సినిమాల విడుదల సమయంలో అనేక మంది నటులు థియేటర్‌కు వెళ్లి సినిమా చూడడం సర్వసాధారణమని పేర్కొంటూ, ఈ ఘటనలో తనపై ఎలాంటి తప్పు లేదని వివరణ ఇచ్చాడు. ఈ సమయంలోనే పోలీసులు అరెస్ట్ చేయడం పై యావత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కేసులో సంద్య థియేటర్ యాజమాన్యం కూడా చిక్కుల్లో పడింది. థియేటర్ యజమానిని రేణుకాదేవి, తమపై కేసులు పెట్టడం తప్పు అని హైకోర్టులో సవాల్ చేశారు. థియేటర్‌ను డిస్ట్రిబ్యూటర్లకు అప్పగించి, ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతినిచ్చినట్లు తెలిపారు. ఇదిలా ఉంటె అల్లు అర్జున్ అరెస్ట్ పై సీఎం రేవంత్ స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది..అరెస్ట్ విషయంలో తన జోక్యం ఏమిలేదని రేవంత్ తెలిపారు. సోషల్ మీడియా లో మాత్రం పలు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మొన్న పుష్ప 2 సక్సెస్ మీట్ లో సీఎం రేవంత్ పేరు ను అల్లు అర్జున్ మరచిపోయినందుకే ఈరోజు ఆయన్ను అరెస్ట్ చేసి ఉంటారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Read Also : Swarnandhra Vision 2047: స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు