Adipurush Controversy: ఆదిపురుష్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. సినిమా విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాను వివాదాలు ఏ మాత్రం వదలడం లేదు. అయితే ప్రస్తుతం ఈ సినిమాపై రాజకీయ నీడలు అలుముకున్నాయి. తాజాగా ఆదిపురుష్ నిషేధించాలని ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘెల్ గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. ఆదిపురుష్ సినిమా రాముడి ప్రతిష్టను పాడుచేస్తుందని పేర్కొంటూ సినిమాపై నిషేధం విధించాలని బఘెల్ ఒక ట్వీట్‌లో కోరారు.
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ చిత్రంలో రాముడిగా ప్రభాస్ నటించగా, సీతగా కృతి సనన్ నటించింది. ఇక రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించారు. ఈ మధ్యే ఆదిపురుష్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమాపై అనేక వివాదాలు చుట్టుముట్టాయి. ఆది నుంచి ఈ వివాదాలు సినిమాని వెంటాడుతూనే ఉన్నాయి. అయితే విడుదల తరువాత సినిమాని బ్యాన్ చేయాల్సిందిగా డిమాండ్స్ వినిపించడంతో ఆ ప్రభావం సినిమా వసూళ్లపై భారీగా పడింది.
Read More: Tesla Car: టెస్లా కారులో మరో సీక్రెట్ ఫీచర్.. ఎలా పనిచేస్తుందో తెలుసా?