Site icon HashtagU Telugu

Pawan Kalyan Trending: పవన్ ప్రొఫైల్ ఫొటో చేంజ్.. ట్విట్టర్లో ట్రెండింగ్!

Pawan

Pawan

ఒకవైపు సినిమాలు చేస్తూ.. మరోవైపు జనసేన అధినేతగా రాజకీయాల్లో బిజీబిజీగా ఉన్న పవన్ కళ్యాణ్‌కు లెక్కలేని అభిమానులు ఉన్నారు.  ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ప్రొఫైల్ డిస్‌ప్లే ఫోటోను మార్చడం కూడా ట్విట్టర్ ట్రెండింగ్ గా మారింది. తన ట్విట్టర్ ప్రొఫైల్ ఇమేజ్‌ మార్చేయడంతో ఆయన ఫాలోవర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు . ప్రొఫైల్ ఫొటోను మార్చినప్పటి నుండి #PawanKalyan, #Janasena అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ చివరిసారిగా ‘భీమ్లా నాయక్’లో కనిపించారు. తదుపరి సినిమా క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీర మల్లు’లో కనిపించనున్నారు. పౌరాణిక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ యోధుడిగా కనిపించనున్నాడు. ఇక ‘గబ్బర్ సింగ్’ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘భవదీయుడు భగత్ సింగ్’ కోసం పవన్ కళ్యాణ్ సిద్దమవుతున్నాడు.

https://twitter.com/MaraathiManus/status/1545327465048195072?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1545327465048195072%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.bollywoodlife.com%2Fsouth-gossip%2Fpawan-kalyan-trends-on-twitter-for-an-unbelievably-simple-reason-fans-say-thats-the-craze-view-tweets-telugu-movies-entertainment-news-2122702%2F