Samantha ఖుషి తర్వాత సమంత చేయాల్సిన ఒక సినిమా చూస్తుండగానే చేతులు మారింది. ఆ సినిమాను చేసేది దగ్గర స్నేహితులే అయినా కూడా సమంతకు హ్యాండ్ ఇచ్చి వేరే హీరోయిన్ తో సినిమా అనౌన్స్ చేశారు. ఇంతకీ సమంత వదులుకున్న ఆ సినిమా ఏంటి..? సమంత ప్లేస్ లో వచ్చిన హీరోయిన్ ఎవరు అన్నది చూస్తే.. సమంత క్లోజ్ ఫ్రెండ్ చిన్మయి శ్రీపాద ఆమె భర్త రాహుల్ రవింద్రన్ ఆమెకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటారు. సమంత టఫ్ టైం లో వారిద్దరు ఎంతో సపోర్ట్ గా ఉన్నారు. అయితే సమంత తో చేయాల్సిన రాహుల్ రవింద్రన్ సినిమా ఇప్పుడు ఆమె ప్లేస్ లో రష్మిక వచ్చి చేరింది.
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా ది గర్ల్ ఫ్రెండ్ సినిమా గ్లింప్స్ లేటెస్ట్ గా రిలీజైంది. ఈ టీజర్ చూసిన చాలామంది ఇది సమంతతో చేయాలనుకున్న సినిమా కదా అని అనుకున్నారు. సమంత మయోసైటిస్ వ్యాధి తగ్గినా తనని తాను ఇంకా హెల్దీగా మెరుగు పరచుకునేందుకు టైం తీసుకుంటుంది. విజయ్ తో చేసిన ఖుషి సినిమానే గ్యాప్ లు గ్యాప్ లుగా చేసింది.
ఈ క్రమంలో రాహుల్ రవింద్రన్ (Rahul Ravindran) సినిమా అది కూడా గీతా ఆర్ట్స్ లో అనేసరికి సమంతతో కష్టమని మేకర్స్ భావించారు. అందుకే సమంత ప్లేస్ లో రష్మికని తీసుకున్నారు. ది గర్ల్ ఫ్రెండ్ (The Girl Friend) ఎవరు హీరో రివీల్ చేయలేదు కానీ హీరోయిన్ ని ఇంట్రడ్యూస్ విధానం చూస్తే ఇది ఫిమేల్ సెంట్రిక్ సినిమా అని అనిపిస్తుంది. సమంత స్థానంలో ఛాన్స్ అందుకున్న రష్మిక ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటుందో చూడాలి.
Also Read : Natural Star Nani : రూట్ మార్చిన వివేక్.. నాని సరిపోగా శనివారం టీజర్ టాక్..!