విజయ్ దేవరకొండ – రష్మిక లు పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమయ్యారనే వార్తలు ఈరోజువి కాదు..గీత గోవిందం టైం నుండి ప్రచారం అవుతున్నవే..ఇప్పుడు మరోసారి మళ్లీ వైరల్ గా మారాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందొ విజయ్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) – రష్మిక (Rashmika)..ఈ జంట అంటే అభిమానులకే కాదు సినీ లవర్స్ కు సైతం ఎంతో ఇష్టం. గీత గోవిందం (Geetha Govindam) మూవీ లో జంటగా నటించిన..వీరు ఆ తర్వాత డియర్ కామ్రేడ్ మూవీ లో నటించారు. మొదటి సినిమా నుండే వీరి మధ్య స్నేహం బలపడింది. ఆ తర్వాత నుండి అలాగే కొనసాగుతుంది. వీరిద్దరి మధ్య ఉంది స్నేహం కాదు ప్రేమ అని చాలామంది అంటుంటారు. దీనికి కారణం వీరిద్దరూ కలిసి టూర్స్ కు వెళ్లడం..ప్రవైట్ గా కలుసుకోవడం వంటివి చేయడం తో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని అంత కామెంట్స్ వేస్తుంటారు. పలు మీడియా సమావేశాల్లో కూడా ఈ ప్రస్తావనను వారి ముందుకు తీసుకురాగా..లేదు లేదు మీము జస్ట్ ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమయ్యారనే వార్తలు వైరల్ గా మారాయి. ఫిబ్రవరి రెండవ వారంలో ఇద్దరూ తమ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన వార్తను అధికారికంగా ప్రకటించనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇది చూసిన అభిమానులు నిజామేనా అని మాట్లాడుకోవడం స్టార్ట్ చేసారు. రోజు రోజుకు ఈ వార్తలు వైరల్ అవుతుండడం తో విజయ్ టీం స్పందించింది. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చింది.
ఇక ప్రస్తుతం విజయ్..పరుశురాం డైరెక్షన్లో ఫ్యామిలీ స్టార్ మూవీ లో నటిస్తున్నాడు. సీతారామం ఫేమ్ మృణాల్ హీరోయిన్ గా నటిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అంత అనుకున్నారు కానీ వాయిదా పడింది. ఇక రష్మిక విషయానికి వస్తే యానిమల్ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి వరుస క్రేజ్ ఆఫర్లు అందుకుంటుంది. తెలుగు లో బన్నీ సరసన పుష్ప 2 చేస్తుంది.
Read Also : Bandla Ganesh : కేటీఆర్ కు ఎందుకింత ఈర్ష్య.. అసూయ..? – బండ్ల గణేష్