Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ ఆ గేమ్‌లో స్టేట్, నేషనల్ లెవల్స్ ఆడాడని తెలుసా?

ఎన్టీఆర్ ఓ గేమ్ లో నేషనల్, స్టేట్ లెవల్లో ఆడాడు అని చాలా తక్కువ మందికి తెలుసు.

Published By: HashtagU Telugu Desk
Junior NTR Emotional Tweet

Junior NTR Emotional Tweet

Jr NTR : ఎన్టీఆర్ ప్రస్తుతం నేషనల్ వైడ్ ఫేమ్ తెచ్చుకొని ఇటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేసేస్తున్నాడు. ఇక్కడ దేవర సినిమాతో బిజీగా ఉంటూనే అటు బాలీవుడ్ లో వార్ 2 షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాల కోసం ఎన్టీఆర్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఎన్టీఆర్ అన్నిట్లో బెస్ట్ అని మనకి తెలిసిందే. నటన, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్.. ఇలా అన్నిట్లో ఎన్టీఆర్ చాలా మంది హీరోల కంటే గ్రేట్ అని చెప్పొచ్చు. తన ట్యాలెంట్ తో ఎన్టీఆర్ అందని మెప్పిస్తాడు. ఇక ఎన్టీఆర్ కూచిపూడి డ్యాన్సర్ కూడా అని కొంతమందికి తెలుసు. కానీ ఎన్టీఆర్ ఓ గేమ్ లో నేషనల్, స్టేట్ లెవల్లో ఆడాడు అని చాలా తక్కువ మందికి తెలుసు.

తాజాగా RRR సినిమా కెమెరామెన్ సెంథిల్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి మాట్లాడాడు. సెంథిల్ మాట్లాడుతూ.. RRR షూట్ చేసేటప్పుడు ఓ సీన్ లో ఎన్టీఆర్ పరిగెత్తాలి. మేము యాక్షన్ చెప్పగానే ఫాస్ట్ గా పరిగెత్తాడు. అతని వేగాన్ని మేము అందుకోలేకపోయాము. ఆ సీన్ తర్వాత నేను అడిగాను కెమెరా కంటే కూడా ఫాస్ట్ గా పరిగెడుతున్నావు? ఎలా అంత ఫాస్ట్? అంత ఫిట్నెస్ అని అడిగాను. అప్పుడు ఎన్టీఆర్.. నేను బ్యాడ్మింటన్ ప్లేయర్ ని. బ్యాడ్మింటన్ గేమ్‌లో స్టేట్, నేషనల్ లెవల్లో కూడా ఆడాను అని చెప్పినట్టు తెలిపాడు. అందుకే ఎన్టీఆర్ చాలా ఫిట్ గా, అథ్లెటిక్ గా ఉంటాడని అన్నాడు. దీంతో సెంథిల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ స్టేట్ లెవల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అని తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇంకెన్ని ట్యాలెంట్స్ ఉన్నాయి బ్రో నీలో అని కామెంట్స్ చేస్తున్నారు.

 

Also Read : Lingu Swamy : కమల్ హాసన్ వల్ల కోట్లలో నష్టం వచ్చింది.. సినిమా చేస్తానని ఇప్పటికి చేయలేదు..

  Last Updated: 19 Apr 2024, 04:30 PM IST