వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్(Christopher Nolan) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. తన సినిమాలు కోసం క్రిస్టోఫర్ ఎంచుకునే స్టోరీ లైన్స్.. దిగ్గజ దర్శకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అలా క్రిస్టోఫర్ నుంచి వచ్చిన ఓ అద్భుతమైన మూవీ ‘ఇంటర్‌స్టెల్లర్(Interstellar). స్పేస్ ఆస్ట్రోనాట్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం 2014లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్టుగా నిలిచింది. భూమి పర్యావరణ పూర్తిగా దెబ్బతిని మానవాళి మనుగడకు ముప్పు ఉండడంతో.. అందర్నీ రక్షించేందుకు మరో అనువైన గ్రహం వెతకడం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.
ఇక అసలు విషయానికి వస్తే.. ఈ మూవీలో ఒక సీన్ కోసం 500 ఎకరాల మొక్కజొన్న(Corn) పంట పండించారట. ఈ మూవీ స్టార్టింగ్ లో హీరో కుటుంబం నివసిస్తున్న వద్ద భారీ మొక్కజొన్న పంటని చూపిస్తారు. ఒక సీన్ లో హీరో ఓ స్పై రాకెట్ ని వెంటాడుతూ.. తన కారుతో ఆ మొక్కజొన్న పంటలోకి దూసుకుంటూ వెళ్తాడు. ఈ సీన్ చిత్రీకరించడం కోసం దర్శకుడు.. గ్రాఫిక్స్ ఉపయోగించకుండా నిజమైన మొక్కజొన్న పంటని పండించాలని నిర్ణయించుకున్నారు. దాదాపు లక్ష డాలర్స్ ఖర్చు చేసి 500 ఎకరాల పంటని పండించారు.
ఈ పంట పండించడం కోసం ఒక కొండ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు. మొక్కజొన్న పంటని జాగ్రత్తగా పెంచి అక్కడ సీన్ చిత్రీకరించిన తరువాత.. ఆ మొక్కజొన్న పంటని విక్రయించారు. అలా ఆ పంటని అమ్మడంతో పండించడానికి ఉపయోగించిన లక్ష డాలర్స్ లో ప్రతి డాలర్ వెనక్కి వచ్చిందట. కాగా నోలన్ కంటే ముందు మరో హాలీవుడ్ దర్శకుడు కూడా ఇలా చేశారు. 2013లో ‘మ్యాన్ అఫ్ స్టీల్’ సినిమా కోసం దర్శకుడు జాక్ సిండర్ కూడా నిజమైన మొక్కజొన్న పంట పండించారు.
Also Read : Pooja Kannan : అక్క కంటే చెల్లే ఫాస్ట్‌గా ఉందిగా.. పెళ్లి పీటలెక్కుతున్న సాయి పల్లవి సిస్టర్..