Site icon HashtagU Telugu

Chota K Naidu : తెలుగులో వేరే పరిశ్రమల కెమెరామెన్స్ ని తెచ్చుకోవడంపై.. ఛోటా కె నాయుడు సంచలన కామెంట్స్

Chota K Naidu comments on other industry Cinematographers in Telugu Film Industry

Chota K Naidu comments on other industry Cinematographers in Telugu Film Industry

ఇప్పుడు ఒక భాషకి చెందిన వాళ్ళు ఇంకో భాష సినిమా పరిశ్రమల్లో నటించడం, పని చేయడం చాలా కామన్ అయిపోయింది. కానీ కెమెరామెన్స్(Cameramen’s) మాత్రం ఎప్పట్నుంచో వేరే పరిశ్రమల వాళ్ళు తెలుగులో వర్క్ చేస్తున్నారు. సినిమాని బాగా చూపించాలంటే అన్నిటికంటే ముఖ్యంగా మంచి కెమెరామెన్ ఉండాలి. అందుకే గతంలో కూడా బాలీవుడ్(Bollywood) నుంచి, హాలీవుడ్(Hollywood) నుంచి కూడా అనేక మంది కెమెరామెన్స్ వచ్చి తెలుగులో పనిచేశారు.

ఇక్కడ అగ్ర సినిమాటోగ్రాఫర్స్(Cinematographers) ఉన్నా కూడా కొంతమంది మాత్రం ఇంకా బయటి కెమెరామెన్స్ నే తెచ్చుకుంటారు. తాజాగా దీనిపై తెలుగు సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు(Chota K Naidu) మాట్లాడారు. తెలుగులో కొన్ని వందల సినిమాలకు పనిచేశారు ఛోటా కె నాయుడు. ప్రస్తుతం పెదకాపు సినిమాతో రాబోతున్నారు. శ్రీకాంత్ అడ్డాల(Srikanth Addala) దర్శకత్వంలో తెరకెక్కిన పెదకాపు(Peddha Kaapu) సినిమా సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకి రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కెమెరామెన్ ఛోటా కె నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఛోటా కె నాయుడు మాట్లాడుతూ.. పెదకాపు లాంటి కథే కాదు, ఏ కథ ఇచ్చినా హైదరాబాద్ లో ఉన్న కెమెరామెన్స్ ఇంతకంటే బాగా తీస్తారు. మన దగ్గర చాలా ట్యాలెంటెడ్ కెమెరామెన్స్ ఉన్నారు. కానీ తెలుగు సినీ పరిశ్రమలో కమ్యూనికేషన్ లోపం ఉందని భావిస్తాను. ఇక్కడ కొత్తగా ఒక కథ చేయాలి అనుకోగానే పొరుగు భాషల్లో ఇలాంటి సినిమాలు ఏం వచ్చాయి, వాటికి ఎవరు కెమెరామెన్ గా పనిచేసారు అని వెతుకుతారు. ఆ సినిమాల్లో విజువల్స్ వీళ్ళకి నచ్చితే నాకు కూడా అలాగే కావాలని వేరే పరిశ్రమ కెమెరామెన్స్ ని రప్పించుకుంటారు. కానీ కొంచెం ధైర్యం చేస్తే మన దగ్గరే అంతకంటే బాగా తీయగలిగే కెమెరామెన్స్ దొరుకుతారు. ఈ విషయంలో డైరెక్టర్స్ ని తప్పు పట్టలేం, వాళ్ళ సినిమా మంచిగా రావాలని భావించి వాళ్ళు అలా పిలుస్తారు. వచ్చే కెమెరామెన్స్ ని కూడా ఏం అనలేం, వాళ్ళకి వర్క్ వచ్చింది కాబట్టి వచ్చి చేస్తారు. కానీ ఇక్కడ కూడా అంతే ట్యాలెంటెడ్ కెమెరామెన్స్ ఉన్నారు అని అన్నారు.

 

Also Read : Pawan Kalyan : చంద్రబాబు అరెస్టుతో పవన్ షూట్స్ ఆగవు.. క్లారిటీ ఇచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ టీం..