Thangalaan Trailer : చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా తంగలాన్. నీలమ్ ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో పా రంజిత్ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ గా తంగలాన్ సినిమా తెరకెక్కింది. మాళవిక మోహనన్, పార్వతీ తిరువోతు, పశుపతి, హరికృష్ణన్, అన్భు దురై.. పలువురు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే తంగలాన్ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ చూసి విక్రమ్ మరోసారి కొత్త ప్రయోగం చేస్తున్నాడని, ఓ కొత్త రూపంలో కనపడబోతున్నాడని అంతా అనుకున్నారు. తాజాగా తంగలాన్ ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్ చూస్తుంటే.. ఇది బ్రిటిష్ కాలంలో జరిగిన కథ అని తెలుస్తుంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. బ్రిటిష్ కాలంలో కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో బంగారం కోసం బ్రిటిష్ వాళ్ళు వెతుకుతారు. అందుకు అక్కడ స్థానికంగా ఉండే తెగల వాళ్ళని పనిలోకి తీసుకుంటారు. కానీ బంగారం వెలికితీతలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే మరో తెగ వీరి మీద దాడి చేస్తుంది. ఇవన్నీ తెగ నాయకుడిగా విక్రమ్ ఎలా ఎదుర్కున్నాడు అన్నట్టు ట్రైలర్ చూపించారు.
ట్రైలర్ తో సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది. పీరియాడిక్ యాక్షన్ తో పాటు విక్రమ్ కొత్త అవతారం, సరికొత్త యాక్షన్ సీక్వెన్స్ లు సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ సినిమా కోసం ఇప్పటికే విక్రమ్ రెండు సార్లు షూటింగ్ లో యాక్సిడెంట్ కి గురయి కోలుకున్నాడు. తంగలాన్ కోసం విక్రమ్ చాలా కష్టపడ్డాడు. ప్రస్తుతం తంగలాన్ ట్రైలర్ ట్రెండింగ్ లో ఉంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు. మీరు కూడా తంగలాన్ ట్రైలర్ చూసేయండి..
Also Read : Swayambhu : నిఖిల్ కూడా అదే బాటలో.. ‘స్వయంభు’ సినిమా కూడా..