Site icon HashtagU Telugu

Chiranjeevi : హల్దీ వేడుక లో మెగాస్టార్ హైలైట్

Chiru Pic

Chiru Pic

మరికొద్ది గంటల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రేమించిన ప్రియురాలి మేడలో మూడుముళ్ల తో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi ) ని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ మధ్యనే ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుగగా.. రేపు (నవంబర్ 01 న) ఇటలీ లో వీరి వివాహం జరగబోతుంది. మూడు రోజులుగా అక్కడ పెళ్లి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

గతరాత్రి కాక్ టైల్ పార్టీ గ్రాండ్ గా జరిగింది. ఈ పార్టీ లో రామ్ చరణ్, అల్లు అర్జున్ హైలైట్ గా నిలిచారు. ఒకే ఫ్రేమ్ లో ఈ ఇద్దరు హీరోలు.. నూతన వధూవరులతో కలిసి నవ్వుతూ కనిపించారు. ఇక నేడు హల్దీ వేడుక జరిగింది. ఈ హల్దీ (Haldi ) వేడుకలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వైట్ అండ్ ఎల్లో కలర్ థీమ్ డ్రెస్ లతో మెగా ఫ్యామిలీ కనువిందు చేశారు. వరుణ్ ఎల్లో కలర్ కుర్తాలో కనిపించగా.. లావణ్య ఎల్లో కలర్ లెహంగాలో అదరగొట్టింది.

ఇక ఈ హల్దీ వేడుకలో అందరికన్నా హైలైట్ గా నిలిచింది మెగాస్టార్ చిరంజీవే అని చెప్పాలి. డార్క్ ఎల్లో కలర్ కుర్తాలో బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని.. ఒక చైర్ లో కూర్చొని కనిపించాడు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ స్టైల్, స్వాగ్ మాత్రం వేరే లెవెల్ లో ఉందని అభిమానులు కామెంట్స్ వేస్తున్నారు.

Read Also : Sam – Naga Chaitanya : మెగా వేడుకలో చైతు – సామ్ లు కలవబోతున్నారా..?