Site icon HashtagU Telugu

Veera Mallu Trailer : థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే ..వీరమల్లు ట్రైలర్ పై చిరు ట్వీట్

Hhvm Trailer Chiru

Hhvm Trailer Chiru

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘హరిహరవీరమల్లు’ మూవీ ట్రైలర్ పై మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రశంసలు కురిపించారు. ట్రైలర్ ఎంతో ఉత్తేజంగా ఉందని, ఈ మూవీకి థియేటర్లు దద్దరిల్లిపోతాయని చిరంజీవి ట్వీట్ చేశారు. మరోవైపు ‘ట్రైలర్ చూస్తేనే సినిమా ఎలా ఉంటుందో అర్థమవుతోంది. స్క్రీన్ పై బాబాయ్ పవన్ కళ్యాణ్ మంచి ట్రీట్ ఇవ్వబోతున్నారు. మూవీ యూనిట్ కు ఆల్ ది బెస్ట్’ అంటూ చరణ్ ట్వీట్ చేశారు.

China-Pak : భారత్ దెబ్బతో చైనాను నమ్మలేకపోతున్న పాక్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న హిస్టారికల్ యాక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) చాలా రోజులుగా వాయిదాల అనంతరం చివరికి ప్రేక్షకుల ముందుకు రానుంది. 2025 జూలై 24న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ తాజాగా విడుదలై అభిమానుల్లో పూనకాలు తెప్పించింది. ట్రైలర్‌లో పవన్‌ లుక్‌, డైలాగ్స్‌, భారీ యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఇప్పటివరకు సినిమా రాబోతుందా? లేదా? అనే అనుమానాలను ఈ ట్రైలర్ పటాపంచల్ చేసిందని అభిమానులు చెబుతున్నారు.

ఈ సినిమాను మొదట ప్రముఖ దర్శకుడు క్రిష్‌ దర్శకత్వంలో ప్రారంభించగా, కొన్ని కారణాల వల్ల ఆయన ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నారు. అనంతరం జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. పవన్ ఇందులో యోధుడి పాత్రలో కనిపించనున్నారు. మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ఒక డిఫరెంట్ పీరియాడిక్ డ్రామాగా నిలవనుంది. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీతానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సారథ్యం వహించారు.

సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. మొదటి భాగం ‘Sword Vs Spirit’ అనే పేరుతో విడుదల కానుంది. సినిమాటోగ్రఫీ విభాగంలో జ్ఞాన శేఖర్ V.S. మరియు మనోజ్ పరమహంస ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఈ ట్రైలర్‌తో సినిమా మళ్లీ హైప్‌లోకి వచ్చిందని చెప్పాలి. పవన్ కల్యాణ్ మాస్‌, యాక్షన్ ప్రెజెన్స్‌కు తగ్గట్టుగా రూపొందిన ఈ చిత్రం అభిమానులనే కాదు సాధారణ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే అవకాశముంది. మీరు కూడా ఈ ట్రైలర్ పై లుక్ వెయ్యండి.