మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభిమానులకు గుడ్ న్యూస్. చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన యానిమేటెడ్ ఫాంటసీ క్లాసిక్ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari Re Release) మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. ఈ సినిమాను మే 9న 2D, 3D వెర్షన్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సినిమాపై ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని, మోడ్రన్ టెక్నాలజీ సహాయంతో నూతనంగా ముస్తాబు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు.
Earthquake : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూకంపం..పరుగులు తీసిన ప్రజలు
ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ మైలురాయి చిత్రం, అప్పట్లో తెలుగు సినిమా రంగంలో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను అబ్బురపరిచింది. శ్రీదేవి గ్లామర్, చిరంజీవి నటన, ఇళయరాజా అద్భుతమైన సంగీతం సినిమాను మరింత ప్రత్యేకతను చేకూర్చాయి. 1990 మే 9న విడుదలైన ఈ సినిమా అప్పట్లోనే దాదాపు రూ.15 కోట్ల వసూళ్లను రాబట్టి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు అదే మే 9న, 34 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈసారి ప్రేక్షకులకు 2D కాకుండా 3D ఫార్మాట్‌లోనూ సినిమా చూడడానికి అవకాశం కలిగించటం ప్రత్యేక ఆకర్షణ. ఇక ఈ రీ రిలీజ్ దగ్గర పడుతుండడం తో సినిమా తాలూకా అనేక విషయాలు బయటకు వస్తూ ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కోసం చిరంజీవి ఇలాంటి కష్టాలు పడ్డాడో తెలిపిన మేకర్స్..తాజాగా సినిమాలో హీరో , హీరోయిన్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయాన్నీ తెలిపారు.
సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు అప్పట్లో రూ.2 కోట్లు బడ్జెట్ ఖర్చు చేయగా..బాక్స్ ఆఫీస్ వద్ద రూ.15 కోట్లు రాబట్టి అద్భుత విజయం సాధించింది. ఇక ఈ సినిమాకు గాను చిరంజీవి రూ.25 లక్షలు పారితోషికంగా పొందగా, శ్రీదేవి రూ.20 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. 1990లో ఓ హీరోయిన్ ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకోవడం ఒక్క శ్రీదేవికి మాత్రమే చెల్లింది.
35 years later, the magic returns…💫
From Film Reel to Digital Restoration, witness the hard work and meticulous effort that went into bringing #JagadekaVeeruduAthilokaSundari back to the big screen.
Experience the timeless epic once again on May 9th, in 2D & 3D.
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) May 5, 2025