Site icon HashtagU Telugu

Chiru-Balayya : ఒకే ఫ్రేమ్ లో చిరు , బాలయ్య..ఫ్యాన్స్ కు ఇంతకన్నా పెద్ద పండగ ఉంటుందా..?

Balakrishna Chiru

Balakrishna Chiru

నందమూరి బాలకృష్ణ (Balakrishna) , మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi)..వీరిద్దరి గురించి ఎంత చెప్పిన తక్కువే..60 + దాటినా వీరిద్దరూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలతో అలరిస్తూ వస్తున్నారు. వీరిద్దరి అభిమానుల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు మెగా , నందమూరి అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది..కానీ ఇప్పుడు అంత ఒకటయ్యారు. ఇరు హీరోల సినిమాలకు ఇరు అభిమానులు వెళ్తూ సందడి చేస్తున్నారు. అంతే కాదు రెండు ఫ్యామిలీ హీరోలు కలిసి సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే బాలకృష్ణ , చిరంజీవి లను ఒకే ఫ్రేమ్ లో చూడాలని అభిమానులు కోరుకుంటుంటారు. చిరంజీవి , బాలకృష్ణ కలిసి స్టేజ్ పంచుకున్న క్షణాలు చాల తక్కువ.

We’re now on WhatsApp. Click to Join.

.
అలాంటిది తాజాగా బాలకృష్ణ, చిరంజీవి లు కలిసి సందడి చేశారు. ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి కుమారుడు వివాహ వేడుక హైదరాబాద్ అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు బాలకృష్ణ , చిరంజీవి లతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. బాలకృష్ణ , చిరంజీవి లు హాజరుకావడం వేడుకకు మరింత ఆకర్షణ గా నిలిచింది. ముందుగా బాలకృష్ణ , బోయపాటి శ్రీను లు కలిసి వేడుకకు హాజరు కాగా…ఆ తర్వాత చిరంజీవి హాజరయ్యారు. చిరు వస్తుండగా బాలకృష్ణ , బోయపాటి లేచి నిల్చుని చిరు కు కరచాలనం అందించారు. ప్రస్తుతం దీనికి సంబదించిన వీడియోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుండడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Read Also : Polavaram : పోలవరానికి రూ. 12,000 కోట్లు అడ్వాన్స్?