Site icon HashtagU Telugu

Chiru leaks: చిరు లీక్స్.. తమన్నా, కీర్తి సురేశ్ లతో మెగాస్టార్ స్టెప్పులు!

Chiru Leakes

Chiru Leakes

చిరంజీవికి మెగాస్టార్ తో పాటు చిరు లీక్స్ అనే బిరుదు కూడా యాడ్ అయ్యింది. అయితే చిరంజీవి అనుకోకుండా తాను నటించబోయే సినిమా టైటిల్స్ ను ప్రకటించడమో, ముందుగానే మూవీ అప్ డేట్స్ ఇవ్వడం వల్ల చిరు లీక్స్ అనే ముద్ర ఆయనపై పడింది. అయితే ఇవన్నీ పట్టించుకోకుండా చిరంజీవి సినిమాలు చేసుకుంటూపోతున్నాడు. తాజాగా ఆయన తనదైన స్టైల్ లో భోళా శంకర్ ప్రమోషన్ ని మొదలుపెట్టేశారు. ప్రస్తుతం సంగీత్ కార్యక్రమానికి సంబంధించిన ఒక కీలక సాంగ్ హైదరాబాద్ లో షూట్ చేస్తున్నారు దర్శకుడు మెహర్ రమేష్.

ఈ చిత్రీకరణ తాలూకు మేకింగ్ వీడియోని ఇన్స్ టాలో షేర్ చేస్తానని ముందే చెప్పిన చిరు దానికి తగ్గట్టే వీడియోని వదిలారు. హీరోయిన్ తమన్నా, చెల్లెలిగా నటిస్తున్న కీర్తి సురేష్, బావ సుశాంత్ లతో పాటు కమెడియన్లు హైపర్ ఆది, రఘుబాబు తదితరులంతా ఇందులో భాగమయ్యారు. మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన పాటకు చివర్లో డాన్స్ మొదలుపెట్టడంతో ఆపేశారు.

వేదాళం రీమేక్ గా ఇప్పటికీ నెగటివిటీని మూటగట్టుకున్న భోళా శంకర్ కు ఫస్ట్ ఆడియో సింగ్ మిశ్రమ స్పందన దక్కింది. రొటీన్ గా ఉందని కొందరు, మెల్లగా ఎక్కేస్తుందని మరికొందరు సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేశారు. సో కంటెంట్ ఏదో బలంగా ఉందని చెప్పాలంటే ఇలాంటి మేకింగ్ వీడియోలు వదలడం అవసరమే. చిరు, కీర్తి సురేష్, తమన్నాల మధ్య బాండింగ్ ఆకట్టుకునేలాగా కనిపిస్తోంది. ముఖ్యంగా కాస్ట్యూమ్స్ చూస్తుంటే అన్నయ్య నాటి చిరంజీవి గుర్తుకు వచ్చారని ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. ఈ మూవీ ఆగస్ట్ 11న విడుదల కాబోతోంది.

Also Read: Medical Colleges: మెడికల్ కాలేజీలపై కిరికిరీ.. బీజేపీకి బీఆర్ఎస్ స్ట్రాంగ్ కౌంటర్!