Site icon HashtagU Telugu

GodFather 2nd Single: మెగా మాస్.. గాడ్ ఫాదర్ రెండో సాంగ్ అదిరింది!

Godfather

Godfather

టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి పాట థార్ మార్ సాంగ్ అభిమానులను ఉర్రూతలూగించింది. తాజాగా ఈ సినిమానుంచి మరో సాంగ్ ను రిలీజ్ చేశారు. నజభజ అంటూ సాగే ఈ సాంగ్ అదిరిపోయిందనే చెప్పాలి. సినిమా రిలీజ్ కంటే ముందే.. తన బాసిజాన్ని.. తన క్రేజ్‌ను మరో సారి అందరికీ దిమ్మతిరిగేలా రేంజ్‌లో చూపించబోతున్నారు మెగాస్టార్.

అనంతపురాన్ని తన అడ్దాగా మార్చుకుని.. గాడ్ ఫాదర్ పేరును మారుమోగించనున్నారు.  చిరు మోస్ట అవేటెడ్ ఫిల్మ్ గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సెప్టంబర్ 28న అనంతపూర్‌లో నిర్వహించనున్నారు మేకర్స్ . ఇక ఇప్పటికే అనంతపూర్ లోని గవర్నమెంట్ ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాట్లు కూడా మొదలెట్టేశారు.. ఈ సినిమానే కాకుండా.. భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాల్లోనూ చిరు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.

Exit mobile version